శివశంకర్ కుటుంబానికి కాంగ్రెస్ నేతల పరామర్శ | Digvijaya Singh and khuntia consoling Shivashankar family | Sakshi
Sakshi News home page

శివశంకర్ కుటుంబానికి కాంగ్రెస్ నేతల పరామర్శ

Published Wed, Mar 1 2017 9:42 PM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

Digvijaya Singh and khuntia consoling Shivashankar family

హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, వివిధ రాష్ట్రాల గవర్నర్‌గా పని చేసిన పి. శివశంకర్ కుటుంబాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి తెలంగాణ ఇంచార్జి దిగ్విజయ్ సింగ్, కార్యదర్శి ఆర్.సి కుంతియాలు పరామర్శించారు. బుధవారం రాత్రి జూబ్లీ హిల్స్ లోని మాజీ మంత్రి శివశంకర్ ఇంటికి వెళ్లి ఆయన సతీమణి లక్ష్మిబాయి, కుమారుడు వినయ్ కుమార్ లను దిగ్విజయ్, కుంతియా సహా కొందరు కాంగ్రెస్ నేతలు పరామర్శించారు. దివంగత నేత శివశంకర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారి వెంట టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, ప్రోటోకాల్ ఇంచార్జి హెచ్ వేణుగోపాల్ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement