
‘సద్భావన’ చిహ్నాన్ని కూల్చడం దారుణం
రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర చిహ్నాన్ని కూల్చడం దారుణమని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు.
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర చిహ్నాన్ని కూల్చడం దారుణమని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. రాజీవ్‌గాంధీ సద్భావన యాత్ర సందర్భంగా పాతబస్తీలో ఏర్పాటు చేసిన చిహ్నాన్ని కూల్చడంపై పీసీసీ నేతలు సోమవారం వేర్వేరుగా మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు సామరస్య వాతావరణాన్ని దెబ్బతీస్తాయని ఉత్తమ్ అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాజీవ్ యాత్ర చిహ్నాన్ని తెలంగాణ జాగృతి నేతలు కూల్చడం అన్యాయమని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు చెప్పారు. కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ మాట్లాడుతూ... రాజీవ్ యాత్ర చిహ్నాన్ని తొలగించిన వారిపై కఠినంగా వ్యహరించాలని డిమాండ్ చేశారు. పీసీసీ అధికార ప్రతినిధి జి.నిరంజన్ మాట్లాడుతూ పోలీస్‌స్టేషన్‌కు ఎదురుగా ఉన్న రాజీవ్‌గాంధీ పోల్‌ను పోలీసులకు తెలియకుండా తీయడం సాధ్యం కాదన్నారు.