
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడు శ్రీనివాస్ హత్యకు గురయ్యాడు. స్థానిక యువకుడు వంశీ, అతడి అనుచరుల దాడిలో శ్రీనివాస్ మృతిచెందినట్టు సమాచారం.
వివరాల ప్రకారం.. జిల్లాలోని కక్కలపల్లి వద్ద వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడు శ్రీనివాస్ దారుణహత్యకు గురయ్యాడు. స్థానికంగా ఉన్న టమోటా మార్కెట్‌లో శ్రీనివాస్‌తో వంశీ అనే వ్యక్తి గొడవకు దిగాడు. అనంతరం, వంశీ తన అనుచరులను తీసుకువచ్చి శ్రీనివాస్‌పై దాడి చేశారు. ఈ క్రమంలో శ్రీనివాస్ మృతిచెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.
ఇదిలా ఉండగా.. శ్రీనివాస్ హత్య నేపథ్యంలో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం, బాధిత కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన పోలీసులను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment