![Durgam Srinivas Elected As Medical And Health Contract Employees Union President - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/19/DURGAM-SRINIVAS1.jpg.webp?itok=K_0rM3OS)
ధ్రువీకరణ పత్రం అందుకుంటున్న శ్రీనివాస్
సుందరయ్యవిజ్ఞానకేంద్రం: తెలంగాణ మెడికల్ హెల్త్ అవుట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా దుర్గం శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఆ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్‌ఎస్ కెవి రాష్ట్ర అధ్యక్షుడు జి.రాంబాబు యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు పీఆర్‌సీలో 30% జీతాలు పెంచడానికి నిర్ణయించడం ఒక చారిత్రక ఘట్టమని తెలిపారు.
ఇతర రంగాల్లో ఉన్న కార్మిక ఉద్యోగుల సమస్యలు ఎప్పటికప్పుడు కేసీఆర్ పరిష్కరిస్తున్నారన్నారు. ఉద్యోగులు కార్మికులు ఐక్యంగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. నూతనంగా ఏర్పాటైన రాష్ట్ర కమిటీ కార్మికులకు ఉద్యోగులకు నిరంతరం అందుబాటులో ఉండాలన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండీ రఫీయుద్దీన్, కోశాధికారి సుభాష్ తదితరులు మాట్లాడారు. వచ్చేనెల మూడో వారంలో తెలంగాణ మెడికల్ హెల్త్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ మొదటి మహాసభను హైదరాబాద్‌లో నిర్వహించాలని తీర్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment