sundarayya vignana kendram
-
వేగుచుక్కల వెలుగు కథలు
చరిత్ర వలెనె సాహిత్య చరిత్ర కూడా ఎప్పటికప్పుడు ఉపాంతీకరణకు గురైన భిన్న సామాజిక వర్గాల క్రియాశీల శక్తి సామ ర్థ్యాలనూ, సృజన విమర్శ శక్తులనూ సమీకరించి, చేర్చుకొంటూ సమగ్రం కావాల్సిందే. అలా తెలుగు సాహిత్య చరిత్ర స్త్రీల, దళిత బహుజనుల, ముస్లిముల సాహిత్యంతో 1980ల నుండి చెతన్యవంతంగా సంపద్వంత మవుతూనే ఉంది. ఈ చరిత్రలో భాగంగానే ‘విరసం’ ఇప్పుడు ‘వియ్యుక్క’ అనే పేరుతో ఆరు కథా సంకలనాలు ప్రచురిస్తున్నది. ‘‘ఈ సంకలనాల్లో చేరిన కథలు అజ్ఞాత మావోయిస్టు ఉద్యమంలో పని చేసి అమరులైనవారూ, కొనసాగుతున్నవారూ, అరెస్టయినవారూ, ఏ ఇతర కారణాల వల్లనైనా కొంత కాలం పని చేసి బయట ఉన్నవారూ రాసిన కథలు’’ అంటారు సంకలనాల సంపాదకు రాలు బి. అనురాధ. ఆ రకంగా అటు విప్లవ సాహిత్యంలోనూ ఇటు స్త్రీల సాహిత్యంలోనూ ఇది ఒక చారిత్రక ఘట్టం. 2007 నుండి అజ్ఞాత రచయిత్రుల కథల సేకరణ చేస్తూ వచ్చిన అనురాధ స్త్రీల పేర్లతో ఉన్న కథలు అన్నీ స్త్రీలు రాసినవో కావో నిర్ధారించుకొనటానికి, ఒక రచయిత్రి ఎన్ని కలం పేర్లతో రాసిందో గుర్తించిఒక పేరును ఖరారు చెయ్యటానికి అనుసరించిన పద్ధతులు చాలాఆసక్తికరమైనవి. మహిళా ఉద్యమంతో తనకు ఉన్న సంబంధంతో పాటు, ఈ కథల గురించి విరసం ప్రకటనకు ఆ రచయిత్రులుస్పందించి పత్రికా ముఖంగా ఇచ్చిన వివరాలు కూడా ఈ పనికి ఉపకరించాయి అంటుందామె. ‘వియ్యుక్క’ గోండీ భాషాపదం. వేగుచుక్క అని దాని అర్థం.ఇందులోని 282 కథలు 52 మంది మహిళా విప్లవకారులు రాసినవి. స్త్రీల కథాసంకలనాలు ఎన్నో వచ్చాయి గానీ ఒక రాజకీయార్థిక సామాజిక అవగాహన కలిగిన 52 మంది స్త్రీల సంకలనాలు మాత్రం ఇప్పటికి ఇవే. వ్యక్తులుగా ఎవరు ఎన్ని కథలు రాశారన్నది చెప్పటం ఈ సంకలనాల ఉద్దేశం కాదు. ఒకటి రెండు కథలు రాసినవాళ్లు కూడా ఇందులో ఉన్నారు. విప్లవ జీవితం అందరికీ సమష్టి అనుభవం. ఆ అవగాహన నుండే విప్లవోద్యమంలో వచ్చిన పరిణామాన్ని స్త్రీల అనుభవ కోణం నుండి నమోదు చేయటం ఈ సంకలనాలకు లక్ష్యం. ఆరు సంకలనాలలో మొదటి మూడు ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి. మొత్తం ఈ 146 కథలకు విప్లవోద్యమమే వస్తువు. సొంత కుటుంబాలు, ఆస్తులు, పేర్లు – అన్నీ వదులుకొని శ్రామిక వర్గ ప్రయోజనాల కోసం, ఉత్పత్తి సంబంధాలలో మార్పు కోసం, ఉన్నత మానవీయ విలువలతో నూతన సమాజ నిర్మాణం కోసం విప్లవోద్యమంలోకి వెళ్ళిన వాళ్ళ అనుభవ కథనాలు ఇవి. ఈ కథలకు వస్తువైన జీవిత సందర్భాలు, శకలాలు భిన్నం కావచ్చు. కానీ సాధారణ ప్రజల అసాధారణ ధిక్కారం ఈ అన్ని కథలకూ అంతః సూత్రం. ఆచారాలు, రివాజులు, దోపిడీ, పీడన, రాజ్యం, దాని అణచివేత, సామ్రాజ్యవాద చొరబాటు వంటివన్నీ ఈ కథల సాధారణ అంశం. దాని సారం క్రియాశీల సౌందర్యం. ప్రాణాలు పణం పెట్టే సంసిద్ధత, మృత్యువుతో క్రీడలు, వీటన్నిటి దుఃఖోద్వేగాలు ఈ కథల ప్రత్యేకత. ఇవన్నీ వ్యక్తిగత స్థాయిని దాటి విశ్వ ప్రేమగా ఈ కథలలో ఆవిష్కృతమయ్యాయి. గనుల తవ్వకాలకు అడవులను ఆక్రమిస్తున్న బహుళ జాతి కంపెనీ లకు మద్దతును ఇచ్చే ప్రభుత్వ అభివృద్ధి నమూనాకు ఆదివాసీల నిర్వాసితత్వానికి ఉన్న సంబంధాన్ని మానవ సంబంధాలలో భాగంగా అర్థం చేయించే సోయి, ‘సీతాబాయి గెలుపు’, ‘లక్ష్మణరేఖ’ వంటి కథలు ఎన్నో ఇందులో ఉన్నాయి. విప్లవోద్యమం మనుషులను అన్య వర్గ, ఆధిక్య భావన నుండి విముక్తం చేసి కొత్త మనుషులుగా మారు స్తుందని ‘చాయ్ గ్లాస్’ (2012) కథ చెప్తుంది. అహంకారాన్నీ, అధికా రాన్నీ వదులుకొంటూ ఎదుటివాళ్లను వినగలిగిన, వాళ్ళ నుండి నేర్చు కొనగలిగిన సంసిద్ధత విప్లవ సాంస్కృతిక పర్యావరణంలోనే సాధ్య మని ‘ఇద్దరు శస్త్రకారులు’ కథ నిరూపిస్తుంది. ఎన్కౌంటర్ అయిన పిల్లల శవాల కోసం ఆసుపత్రికి వెళ్లిన తల్లులు... మరణించిన బిడ్డలందరి కోసం తల్లులందరి గర్భశోకాన్ని మోసేవాళ్ళు కావటం, ఆ బిడ్డలకు అంత్యక్రియలు గౌరవకరంగా జరగాలనుకొని తమ కడుపున పుట్టకపోయినా ఒడిలోకి తీసుకొని బిడ్డలుగా ప్రకటించే చైతన్యవంతులు కావటం అత్యంత సహజంగా చిత్రితమైన కథలు ‘ఈ శోకం ఎందరిది’, ‘నాబిడ్డనే’, ‘ముగ్గురు తల్లులు’. వాళ్ళు విప్లవ విశ్వమాతలుగా ఎదిగినవాళ్లు. మాతృత్వం విప్లవ మాతృత్వంగా ఆకాశమే హద్దుగా వ్యాపించటం ఈ కథల విశిష్టత. మావోయిస్టుల కార్యకలాపాల గురించీ, దళ జీవితం గురించీ, గిరిజనులకు వాళ్లకు ఉండే సంబంధాల గురించీ పత్రికలలో వచ్చే పాక్షిక కథనాలూ, వక్రీకరణలూ, వాటి వల్ల కలిగే దురభి ప్రాయాలనూ దాటి ఇతిహాసపు చీకటి కోణం అడుగున పడి కనిపించని వాస్తవాల వైపు మన చూపు తిప్పే ఈ కథలు తప్పక చదవవలసినవి. వ్యాసకర్త ప్రరవే కార్యదర్శి, తెలంగాణ (ఈ 24న సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాదులో ‘వియ్యుక్క’ కథా సంకలనాల ఆవిష్కరణ) -
మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడిగా శ్రీనివాస్
సుందరయ్యవిజ్ఞానకేంద్రం: తెలంగాణ మెడికల్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా దుర్గం శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఆ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ కెవి రాష్ట్ర అధ్యక్షుడు జి.రాంబాబు యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు పీఆర్సీలో 30% జీతాలు పెంచడానికి నిర్ణయించడం ఒక చారిత్రక ఘట్టమని తెలిపారు. ఇతర రంగాల్లో ఉన్న కార్మిక ఉద్యోగుల సమస్యలు ఎప్పటికప్పుడు కేసీఆర్ పరిష్కరిస్తున్నారన్నారు. ఉద్యోగులు కార్మికులు ఐక్యంగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. నూతనంగా ఏర్పాటైన రాష్ట్ర కమిటీ కార్మికులకు ఉద్యోగులకు నిరంతరం అందుబాటులో ఉండాలన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండీ రఫీయుద్దీన్, కోశాధికారి సుభాష్ తదితరులు మాట్లాడారు. వచ్చేనెల మూడో వారంలో తెలంగాణ మెడికల్ హెల్త్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ మొదటి మహాసభను హైదరాబాద్‌లో నిర్వహించాలని తీర్మానించారు. -
చండ్ర పుల్లారెడ్డి: అవిశ్రాంత వీరునికి జోహార్లు
దేశం తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రపంచ ఆకలి సూచిలో దయనీయ స్థానంలో దేశం కనిపిస్తోంది. ప్రజాస్వామ్యం పేరిట నోట్లస్వామ్యం, రాజకీయాల్లో మతోన్మాదం రాజ్యమేలుతున్నాయి. పాలక పక్షం ప్రతిపక్షాల్ని సైతం తొక్కిపడ్తూ కాళ్లు, చేతులు ఆడనివ్వడం లేదు. అధికారం అనేది నియంతృత్వానికి సోపానమవుతుండగా విప్లవ ప్రతి పక్షం రోజూ నెత్తురోడుతున్నది. ప్రత్యామ్నాయ రాజకీయ విశ్వాసాలు సైతం బందీ అవుతున్నాయి. ప్రత్యామ్నాయ ప్రజా ప్రతిపక్షం అంతా ఒక శక్తిగా ముందుకొచ్చే తరుణంలో నవంబర్ మాసానికి ఒక ప్రత్యేకత ఉన్నది. విప్లవ శక్తుల ఐక్యతా కృషిలో నిమగ్నమై ఉన్న కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి 1984 నవంబర్ 9న కలకత్తాలో గుండె పోటుతో అమరులయ్యారు. 1917లో కర్నూలు జిల్లా వెలుగోడు గ్రామంలో జన్మించిన చండ్రపుల్లారెడ్డి భూస్వామ్య కుటుంబ వారసత్వాన్ని కాలదన్నాడు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో గెలిచిన బూర్జువా శాసన సభ్యత్వ హోదాను త్యజించి, 50వ ఏట గోదావరిలోయ అడవిలోకి అడుగుపెట్టాడు. 66వ ఏట ఉద్యమంలోనే చివరిశ్వాస వదిలాడు. ఇదే మాసంలో విప్లవ సింహంగా పేరుగాంచిన కామ్రేడ్ పొట్ల రామనర్సయ్య, విప్లవ ఉపాధ్యాయుడు నీలం రామచంద్రయ్య, విప్లవ విద్యార్థి నాయకుడు జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, విప్లవ నాయకురాలు రంగవల్లి, కిషన్‌జీలతో పాటు ఎందరో తమ అమూల్యమైన ప్రాణాలర్పించారు. సామాజిక విప్లవకారుడు జ్యోతిబా పూలే నవంబర్ 26న అమరులైనారు. వీరంతా ఒక మనిషిని వేరొక మనిషి దోపిడి చేయని సమాజం కావాలన్నారు. వారందరికీ విప్లవ జోహార్లు అర్పిస్తూ జరిగే సంస్మరణ సభను జయప్రదం చేయాలని కోరుతున్నాము. – డేగల రమ, (రుద్రారం) తెలంగాణ – రమణారెడ్డి, (బొల్లవరం) ఏపీ అమరుల స్మారక కమిటీ (నేడు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సంస్మరణ సభ) -
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది
సుందరయ్యవిజ్ఞానకేంద్రం: త్రివర్ణ పతాకాన్ని గౌరవించని వారు ఈ దేశాన్ని పాలిస్తున్నారని భారత్ బచావో కో–ఆర్డినేటర్ డాక్టర్ మాగంటి గోపీనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భారత్ బచావో ఆధ్వర్యంలో జరిగిన మేధోమధన సదస్సులో ఆయన మాట్లాడుతూ దేశం నేడు అన్ని రంగాల్లోనూ సమస్యలను ఎదుర్కొంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాలను భష్ట్రు పట్టిస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పేరు వింటేనే వణికిపోతోందని వ్యాఖ్యానించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి మాట్లాడుతూ బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. దేశ సంపదను కొన్ని కులాలకే దోచిపెడుతున్నారని, రూ.10లక్షల కోట్లకు సంబంధించిన బకాయిలు ఒకటి, రెండు కులాలకు చెందిన వారివి మాత్రమే ఎగవేశారని, ఈ మొ త్తాన్ని దేశంలో 10 లక్షల స్కూళ్లపై పెట్టుబడి పెడితే మంచి విద్య అందేదని అన్నారు. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్కు సిద్ధాంతపరమైన భావజాలం ఉందనుకోవటం పొరపాటేనని,. దేశ మౌలిక విలువలు, సూత్రాలను ఆర్ఎస్ఎస్ ధ్వంసం చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ చెరుకు సుధాకర్ మాట్లాడుతూ నేడు జై శ్రీరాం అంటే వెన్నులో వణుకు పుడుతుందే తప్ప భక్తిభావం రావటం లేదన్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర మంత్రి కవాసి లక్మ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అంబానీ, ఆదానీలకు ఈ దేశ సంపదను కట్టబెడుతోందని విమర్శించారు. కార్యక్రమంలో బహుజన ముక్తి మోర్చ జాతీయ అధ్యక్షుడు వామన్ మెశ్రమ్, ప్రొఫెసర్ పిఎల్.విశ్వేశ్వర్రావు, సామాజికవేత్త మూల్‌చంద్ రాణా, ప్రొఫెసర్లు సూరేపల్లి సుజాత, తిరుమలి, మురళీ మనోహర్, బౌద్ధపీఠ అధిపతి భగవతి మహారాజ స్వామి, భారత్ బచావో ప్రతినిధి గాదె ఇన్నయ్య తదితరులు ప్రసంగించారు. -
ఆదివాసీ హక్కులకోసం జాతీయ స్థాయి ఉద్యమం
సుందరయ్యవిజ్ఞానకేంద్రం: ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం రైతు ఉద్యమం తరహాలో జాతీయస్థాయి ఉద్యమం చేయనున్నట్లు పర్యావరణ వేత్త మేధా పాట్కర్ తెలిపారు. ఆదివాసీ, రైతు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞానకేంద్రంలో శనివారం సమా వేశం జరిగింది. ఈ సందర్భంగా మేధాపాట్కర్ మాట్లాడుతూ... అటవీ భూములను కార్పొరేట్లకు కట్టబెట్టే విధంగా నూతన చట్టాన్ని తెచ్చారని, దీనివల్ల పోడు భూములపై గిరిజనులకు హక్కులేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పీపీఐఎంఎల్ న్యూడెమొక్రసీ రాష్ట్ర నాయకులు వేములపల్లి వెంకట్రామయ్య మాట్లాడుతూ.... అడవుల నుంచి గిరిజనులను నెట్టేసేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని విమర్శించారు. ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ నాయకులు, మాజీ ఎంపీ మిరియం బాబూరావు మాట్లాడుతూ... గిరిజనులకు తీవ్ర నష్టం చేసే అటవీ హక్కుల నూతన చట్టాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. -
బీజేపీ నియంతృత్వాన్ని ఉద్యమంలా తీసుకెళ్తోంది
సుందరయ్య విజ్ఞానకేంద్రం: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నియంతృత్వాన్ని కూడా ప్రత్యేక ఉద్యమంలా తీసుకువెళ్తోందని ప్రముఖ రచయిత్రి అరుంధతీరాయ్ ఆరోపించారు. మానవ హక్కుల వేదిక వ్యవస్థాపకుడు కె.బాలగోపాల్ 13వ స్మారకోపన్యాసాన్ని ఆదివారం సుందరయ్యవిజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. వేదిక కార్యదర్శి డాక్టర్ తిరుపతయ్య, సుధ అధ్యక్షతన జరిగిన ఈ సభకు అరుంధతీరాయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... దేశంలో కార్పొరేట్ శక్తులను కాపాడేందుకు నియంతృత్వ వి«ధానాలకు కులమతాలను జోడిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంలో పరోక్ష భాగస్వామి కావడం వల్లే 8ఏళ్లలోనే అదానీ 8 బిలియన్ డాలర్లనుంచి 139 బిలియన్ డాలర్ల ఆదాయంతో ప్రపంచంలోనే సంపన్నుడిగా ఎదిగాడన్నారు. భవిష్యత్‌లో ఇదే వరుసలో అమిత్‌షా కుమారుడు కూడా రానున్నాడని చెప్పారు. అదానీని ప్రభుత్వానికి చెందిన వ్యక్తిగా ఫోకస్ చేయడం కోసమే 2014లో మోదీ.. అదానీ విమానంలో వచ్చి ప్రధాన మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారని తెలిపారు. ప్రస్తుతం దేశంలో బీఎండబ్ల్యూకి, ఎడ్లబండికి పోటీ నడుస్తోందని వ్యాఖ్యానించారు. సామాజిక, విప్లవ శక్తులు మరింత ఎక్కువగా ప్రజల మధ్య పనిచేయాలని ఆకాంక్షించారు. ముస్లిం మహిళలను మరింత అణచివేసేందుకే హిజాబ్ అంశాన్ని తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. ఆలిండియా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ జాతీయ కార్యదర్శి క్లిఫ్టన్ డి రాజోరియో మాట్లాడుతూ... మోదీ ఫాసిజానికి ఫేస్‌లాంటి వాడన్నారు. ఆయన ప్రధాని అయ్యాక దేశంలో కార్మికుల హక్కులు మరింతగా అణచివేతకు గురవుతున్నాయన్నారు. కార్యక్రమంలో పీయూసీఎల్ నాయకులు నిహిర్ దేశాయ్, హెచ్ఆర్ఎఫ్ నాయకులు జహా ఆరా, మానవ హక్కుల వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ జీవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. బాలగోపాల్ రచించిన ‘కోర్టు తీర్పులు – సామాజిక న్యాయం’ అనే పుస్తకాన్ని అరుంధతీరాయ్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. -
గొర్రెలొద్దు.. డబ్బులు కావాలి
సాక్షి, హైదరాబాద్/సుందరయ్య విజ్ఞాన కేంద్రం: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సబ్సిడీ గొర్రెల పథకం కింద తమకు గొర్రెలు వద్దని, నగదు బదిలీ చేస్తే లబ్ధిదారుడికి అనుకూలంగా ఉన్న చోట గొర్రెలు కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పించాలని తెలంగాణ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం (జీఎంపీఎస్) డిమాండ్ చేసింది. ఈ మేరకు జీఎంపీఎస్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన చర్చావేదికలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. జీఎంపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కిల్లె గోపాల్ అధ్యక్షతన జరిగిన చర్చా వేదికలో నగదు బదిలీ తీర్మానాన్ని సంఘం ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్ ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై పలువురు మాట్లాడిన అనంతరం చర్చా వేదిక ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ చర్చా వేదికలో పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ గొర్రెలు, మేకల పెంపకందారులకు 1లక్ష 75 వేల నుంచి 5 లక్షల రూపాయల వరకు పెంచాలని, ఈ పథకం కింద నగద బదిలీ చేయాలని కోరారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి తనవంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఈ పథకం అమలులో కోట్లాది రూపాయల అవినీతి ఆరోపణలు వచ్చాయని, ఇకనైనా ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీపీసీసీ అధికార ప్రతినిధి లోకేశ్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ ఉపాధ్యక్షుడు మారం తిరుపతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సదస్సులో మాట్లాడుతున్న ఆర్.కృష్ణయ్య -
స్కాలర్షిప్లు పెంచకుంటే ప్రగతి భవన్‌ను ముట్టడిస్తాం
సుందరయ్యవిజ్ఞానకేంద్రం: రాష్ట్రంలో విద్యార్ధులకు స్కాలర్షిప్లు పెంచకుంటే ప్రగతిభవన్‌ను ముట్టడిస్తామని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా విద్యార్థులకు స్కాలర్షిప్ రూ.1500 నుంచి రూ.3 వేలకు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం జరిగిన సదస్సులో ఆర్.కృష్ణయ్య ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. పేద విద్యార్ధులకు ఫీజు రియింబర్స్‌మెంట్ ఇచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డికే దక్కుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రియింబర్స్‌మెంట్ ఇవ్వడం లేదని మండిపడ్డారు. బీసీ గురుకులాలకు ఒక ఐఏఎస్‌ను నియమించకపోవటం బాధాకరమన్నారు. తెలంగాణలో బీసీ సంక్షేమశాఖ నిర్వీర్యం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 240 బీసీ హాస్టళ్లు అద్దెభవనాల్లో కొనసాగుతున్నాయని, వాటికి సొంత భవనాలను నిర్మించాలని డిమాండ్ చేశారు. విదేశాల్లో విద్యకోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి బీసీ విద్యార్థికి 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
19 నుంచి టీఎమ్‌ఎస్‌ఆర్‌యూ మహాసభలు
సుందరయ్యవిజ్ఞానకేంద్రం: తెలంగాణ మెడికల్, సేల్స్ రిప్రజెంటీవ్స్ యూనియన్(టీఎమ్‌ఎస్‌ఆర్‌యూ) రాష్ట్ర మహాసభలను ఈ నెల 19 నుంచి రెండు రోజుల పాటు సుందరయ్యవిజ్ఞానకేంద్రంలో నిర్వహిస్తున్నట్లు యూనియన్ సంయుక్త ప్రధాన కార్యదర్శి ఏ.నాగేశ్వర్రావు తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. మహాసభలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఎ.నర్సిరెడ్డి, సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్, ఎఫ్ఎంఆర్ఏఐ అధ్యక్షుడు రమేష్ సుందర్ తదితరులు పాల్గొంటారని తెలిపారు. మందులు, వైద్య రంగంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సదస్సులో చర్చించనున్నట్లు తెలిపారు. సమావేశంలో పి.మురళీ, టీఎంఎస్‌ఆర్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ.రాజు భట్, కార్యదర్శి సునీల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
10న యువ కవి సమ్మేళనం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాహితి, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ నెల 10న సుద్దాల హనుమంతు యాదిలో ‘నల్లమల యురేనియం తవ్వకాలపై యువ కవి సమ్మేళనం’ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమ పోస్టర్‌ను సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరించారు. ఇందులో తెలంగాణ సాహితి ప్రతినిధులు భూపతి వెంకటేశ్వర్లు, జి.నరేష్, డీవైఎఫ్ఐ అధ్యక్షుడు విప్లవ కుమార్, ప్రధాన కార్యదర్శి విజయ్‌కుమార్ పాల్గొన్నారు. -
ఒకే కాన్పులో నలుగురు శిశువులు
సుందరయ్యవిజ్ఞానకేంద్రం: ఒకే కాన్పులో నలుగురు శిశువులు జన్మించడం అరుదైన విషయమని నియో బీబీసీ న్యూ బార్న్ చిల్డ్రన్స్ హాస్పిటల్ డైరెక్టర్లు డాక్టర్ ఎన్.ఎల్.శ్రీధర్, డాక్టర్ బి.సురేష్, డాక్టర్ శ్రీరాం అన్నారు. ఆదివారం విద్యానగర్‌లోని నియో బీబీసీ న్యూ బార్న్ చిల్డ్రన్స్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నెల 2న రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన హేమలతకు చిలకలగూడలోని గీతా నర్సింగ్ హోంలో నలుగురు పిల్లలు జన్మించారని, వీరిలో ఇద్దరు మగ, ఇద్దరు ఆడపిల్లలు అని తెలిపారు. డాక్టర్ మధురవాణి, డాక్టర్ త్రిగుణల ఆధ్వర్యంలో విజయవంతంగా ఆపరేషన్ చేశారన్నారు. శిశువులు పుట్టిన వెంటనే విద్యానగర్‌లోని నియో బీబీసీ న్యూ బార్న్ చిల్డ్రన్స్ ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. పుట్టినప్పుడు ఓ శిశువు కిలో, మరొకరు 1,100 గ్రాములు, ఇంకొకరు 1,200, 1,400 గ్రాముల చొప్పున బరువు ఉన్నారని తెలిపారు. ఏడున్నర నెలలకే(31 వారాలకే) కాన్పు కావడంతో శిశువులు తక్కువ బరువుతో ఉన్నారని వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం పిల్లలకు ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదని, వారు ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు. నియో బీబీసీలో ప్రత్యేక శ్రద్ధతో వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ప్రపంచంలో 8 లక్షల మందిలో ఒకరికి ఇలా అరుదైన కాన్పు జరుగుతుందని వారు అన్నారు. 9 నెలలు నిండక ముందే ఇలా కాన్పు అవుతుందన్నారు. సమావేశంలో వైద్యులు హారిక, శ్రుతి తదితరులు పాల్గొన్నారు. -
గమనం, గమ్యం రెండూ ప్రజల పక్షమే
అన్యాయాన్నెదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు – అన్న కాళోజీ గౌరవాధ్యక్షుడిగా అంకురించిన సంస్థ తెలంగాణ రచయితల వేదిక (తెరవే). 2001లో పుట్టిన నాటి నుంచీ ఉమ్మడి రాష్ట్రంలో వలస ఆధిపత్యానికి వ్యతిరేకంగా కవులు రచయితలూ కళాకారుల్ని తెరవే కూడగట్టింది. చరి త్రలో తెలంగాణా రచయితది ఎప్పటికీ ప్రతిఘటన స్వరమే అని నిరూపించింది. మలిదశ ప్రత్యేక రాష్ట్రో ద్యమంలో ధిక్కారానికి నిలువెత్తు రూపమై నిలబడింది. తెలంగాణా ప్రజల ఆకాంక్షల్ని వినిపించే గొంతుక అయ్యింది. తెరవే నడిపిన ‘సోయి’ పత్రిక తెలంగాణ సోయిని ఊరూ వాడా ప్రచారం చేసి అన్నివిధాలా ఉద్యమ వేదికగా మారింది. ఉమ్మడిపాలనలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణా చరిత్రని తవ్వి తీసే పనికి సైతం తెరవే స్వచ్చందంగా పూనుకొంది. సొంత రాష్ట్రం సొంత ప్రభుత్వం యేర్పడ్డాక సైతం తెలంగాణా రచయితల వేదిక తన చారిత్రిక కర్తవ్యాన్ని విస్మరించలేదు. ప్రజల కలల్ని పాలకుల దయా దాక్షిణ్యాలకు వదిలేయ లేదు. ప్రతి సామాజిక సమస్యకూ ప్రతిస్పందించింది. పాలకులకు దిశా నిర్దేశం చేసింది. ప్రజావసరాల దృష్ట్యా తెరవే సాహిత్య సాంస్కృతిక విధానాలనే కాదు రాజకీయ విధానాల్ని కూడా తెలియజెప్పింది. ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించిన ప్రతి సందర్భం లోనూ నిర్మొహమాటంగా ఖండించింది. కానీ ఈ నాలుగేళ్లలో తెలంగాణ బుద్ధిజీవుల సమాజం రెండుగా విడిపోయింది. తెలంగాణా రాష్ట్రోద్యమంలో అన్నిటికీ తెగించి ముందు నిలబడ్డ రచయితలు, కళాకారులు సైతం రాష్ట్రం రాగానే యిక చేయాల్సిందేం లేదని మౌనాన్ని ఆశ్రయించారు. ఉద్యమ కాలంలో యిచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రభుత్వానికి కొంత టైమివ్వాలని కొందరు ప్రజా సమస్యల గురించి, వాటి పరిష్కారాల గురించి కిమ్మనకుండా ఉన్నారు. ప్రజల పక్షాన మాట్లాడిన వాళ్ళని అసంతృప్తవాదులుగా అభివృద్ధి నిరోధకులుగా స్టాంప్ చేస్తున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అవార్డులు, సన్మానాలు, సత్కారాల కోసం పాలకుల ముంగిట క్యూ కడుతున్నారు. కొందరు అందివచ్చిన పదవుల్లో సుఖాసీనులై గతాన్ని మర్చిపోయారు. నాగేటి చాళ్ళలో సాయుధమైన పాట ఫామ్ హౌస్‌లో పాలకుల కటాక్షం కోసం పడిగాపులు కాస్తోంది. గడీలను కూల్చిన కవిత చరి త్రని నమోదు చేసే పేరుతో గడీల ఘనతని కీర్తిస్తోంది. ఇలా కవులూ కళాకారులూ ప్రలోభాలకో, బెదిరింపులకో లొంగిపోయి చెట్టుకొకరూ పుట్టకొకరూ చెదిరిపోతే తెరవే ఒంటరి పోరాటం చేస్తూ చెట్టుకిందే కవిత్వం వినిపించింది. బాట పొంటే పాటని ఎత్తుకొంది. ఎందరో కొత్త రచయితల పుస్తకాలను ప్రచురించి, ఆవిష్కరించి వారికి దన్నుగా నిలబడి మార్గ దర్శనం చేసింది. కలబుర్గి, గౌరీ లంకేశ్ దుర్మరణం పాలైనప్పుడు కలసి వచ్చిన ప్రజా సంఘాలతో తీవ్రంగా నిరసన తెలియజేసింది. కేంద్ర రాష్ట్ర స్థాయిలో రచయితలపై, మేధావులపై అమలయ్యే అణచివేతలకు వ్యతిరేకంగా భావప్రకటన స్వేచ్ఛ కోసం ప్రజాస్వామిక హక్కులకోసం గొంతెత్తి సాయిబాబా అక్రమ అరెస్టుని, ఐలయ్యపై దాడుల్నీ, వరవరరావుపై కుట్ర కేసుల్నీ నిర్ద్వంద్వంగా ఖండించింది.ఒక సాహిత్య సంస్థగా తెరవే తనకు పరిమితులు విధించుకోలేదు. ధూళికట్ట స్థూపం, రామప్ప దేవాలయం మొదలైన చారిత్రిక కట్టడాల పరిరక్షణ కోసం కృషి చేసింది. అక్రమ క్వారీల కారణంగా విధ్వాంసమవుతున్న పర్యావరణం గురించి హెచ్చరించింది. సొంత రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కొనసాగిన తెలంగాణా వనరుల దోపిడీని ఒక రచయితల వేదిక తన ఆచరణలో భాగం చేసుకోవడం గమనిస్తే తెరవే కార్యక్రమాల విస్తృతి అర్థమౌతుంది. తెలంగాణా భాష విశిష్టతల గురించి అధ్యయనం చేయడానికి తొలిసారిగా భాషావేత్తలతో సమావేశాలు నిర్వహించి తెలంగాణా భాష రూపురేఖల్ని నిర్వచించి అది ప్రత్యేక భాష అని నిరూపించడానికి పూనుకున్న ఘనత తెరవేదే. తెలంగాణా పరివ్యాప్తంగా వున్న సమస్త కళాసంపదనీ కాపాడడానికి తెరవే పూనుకొంది. చెంచు పెంటల్లో మందులు పంపిణీ చేసింది. పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జరిగిన పాదయాత్రలో అగ్రభాగాన నడిచింది. ఇంద్రవెల్లి ఆదివాసీ అమరుల సంస్మరణకు డిమాండ్ చేసింది. ప్రజల జీవన ఆకాం క్షలు నెరవేరాలని కవులూ రచయితలూ కళాకారులూ బుద్ధిజీవులూ కోరుకోవాలి. ఎందరో అమరులు ప్రాణాలు సాకపోసి పోరాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని కుక్కలు చించిన విస్తరి కాకుండా కాపాడుకోవడమే ప్రజల ముందున్నా కర్తవ్యం. దాన్ని కవులూ రచయితలూ కళాకారులూ మేధావులూ ప్రేమగా తలకెత్తుకోవాలని తెరవే రాష్ట్ర సభల్లో మరోసారి తీర్మానించుకుందాం. (రేపు హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెరవే మహాసభల సందర్భంగా) ఎ.కె.ప్రభాకర్ వ్యాసకర్త ప్రముఖ విమర్శకులు -
మాట తప్పిన వ్యక్తి సీఎంగా అనర్హుడు
సుందరయ్యవిజ్ఞానకేంద్రం : తమ పార్టీ అధికారంలోకి రాగానే శ్రీశైలం ప్రాజెక్ట్ ముంపు గ్రామాల ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి మాట తప్పారని, మాట తప్పిన వారు ముఖ్యమంత్రి ఎలా అవుతారని తెలంగాణ ప్రజల పార్టీ అధ్యక్షులు, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. చంద్రకుమార్ అన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రజల పార్టీ, తెలంగాణ రైతు సంక్షేమ సమితి ఆధ్వర్యంలో రైతు సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న నలుగురు రైతు కుటుంబాలకు రూ.10 వేల చొప్పున చెక్కులను అందచేశారు. సభలో జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. జీఓలు 98, 67లను అనుసరించి నిర్వాసిత ప్రతి కుటుంబానికి వారసత్వ ఉద్యోగం ఇవ్వాలని, పునరావాసం కింద రూ.10 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలను నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఇంతవరకు ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు పూర్తిస్థాయి పరిహారం చెల్లించలేదన్నారు. కార్పొరేట్ విద్యను అరికడతామని, విద్య, వైద్యం అందిస్తామని చెప్పిన ప్రభుత్వం మాటలు నీటి మూటలయ్యాయని ఎద్దేవా చేశారు. రైతు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, వాస్తవంగా సాగు చేస్తున్న రైతులకు సంక్షేమ పథకాలను అందచేయాలన్నారు. భూమిలేని దళిత గిరిజనులకు మూడెకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రభాకరాచారి, తెలంగాణ ప్రజల పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సాంబశివగౌడ్, సదరా బేగం, సుతారి లచ్చన్న, ఎడవెల్లి మోహన్, వేద వికాస్ తదితరులు పాల్గొన్నారు. -
షూటింగ్ బాల్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: తెలంగాణ రాష్ట్ర షూటింగ్ బాల్ అసోసియేషన్ నూతన కమిటీని ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా విజయ్‌సాగర్, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా జి. కొమురయ్య, కార్యనిర్వాహక కార్యదర్శిగా హరిచరణ్, కోశాధికారిగా రామచంద్రుడు, సంయుక్త కార్యదర్శిగా నాగరాజులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు విజయ్‌సాగర్ మాట్లాడుతూ..షూటింగ్ బాల్ క్రీడను 31 జిల్లాలకు విస్తరించడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడే విధంగా కృషి చేస్తామని అన్నారు. -
అస్తమయం
గుడి, జైలు... బంధించడానికే రెండూ! ఇద్దరు డిటెన్యూలు చాలా గొప్ప విషయాలు చెప్పారు. వారి దగ్గర రోజూ కూర్చుని నోట్స్ వ్రాసుకున్నాను. ఇంతవరకూ తెలుగు సాహిత్యంలోకి రాని విషయాలు సేకరించాను. రెండు నవలలుగా వ్రాయాలనుకున్నాను. ఆ నోట్స్ జైల్లో ఉండే పోలీస్ అధికారి కంటబడింది. తీసుకున్నాడు. నా ఎదుటనే కాల్చివేశాడు. 1975 జూన్ ఇరవై ఆరో తారీఖున అత్యవసర పరిస్థితి ప్రకటించారు. కొన్ని వేల మందిని జైళ్ళలో నింపారు. దేశం అంతా భయం ఆవరించింది. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది అరెస్టయ్యారు. ‘ఇందిరాగాంధీ విధానాలు వ్యతిరేకిస్తున్నారు’ అనుకున్నవాళ్ళను అరెస్టు చేశారు. రాజకీయ కార్యకర్తలకు ఎలానూ తప్పదు; రచయితలను కూడా అరెస్ట్ చేశారు. ‘‘ప్రజలతో ఇప్పటికే చాలా సంబంధాలు పెట్టుకున్నాడు, అంతేకాదు ఇతను రచయిత కూడా’’ అని పోలీసులు నా గురించి రిపోర్టులు పంపిస్తున్నారు ఎప్పటినుంచో. జూలై నాలుగో తారీఖు... సాయంత్రం కొంచెం ఆలస్యంగా వచ్చాను కోర్టు నుంచి. చీకటి పడింది. కొద్దిగా చినుకులు పడుతున్నాయి. పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చాడు. ‘మిమ్మల్ని ఎస్.పి. గారు రమ్మంటున్నారు’ అన్నాడు. నాకు అర్థమయింది. భారతితో(బి.విజయభారతి) చెప్పాను ‘అరెస్టు చేస్తారు’ అని. పోలీస్ జీప్‌లో వెళ్ళాను. ఎస్.పి. గారింటివద్ద పోలీసు వ్యాన్లు... జీప్‌లు... హడావుడిగా ఉంది. ఆయన చెప్పారు ‘‘మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాం’’ అని. ‘మరి ఇంట్లో చెప్పి వస్తాను’ అన్నాను. అదే జీప్‌లో పంపించారు. అప్పటికే జీప్ నిండా తుపాకీ పట్టుకున్న పోలీసులు. ఇంటికి వెళ్ళేసరికి చుట్టూ పోలీసు కాపలా. లోపలికి వెళ్తుంటే నా కూడా తుపాకీతో పోలీసు... నిజామాబాద్‌లో మొదటి అరెస్ట్... పోలీసు స్టేషన్‌కు తీసుకు వెళ్ళారు. ఆ తర్వాత ఒకర్నీ ఒకర్నీ పట్టుకొచ్చారు. దాదాపు పదిహేను మంది. ఆ రాత్రంతా మెలకువతోనే ఉన్నాను. చూడడానికి వచ్చిన జనాన్ని చెదరగొట్టేశారు. పోలీసు స్టేషన్లో రెండు రోజులుంచారు. ఆ తర్వాత కోర్ట్‌లో హాజరు పరిచి జైలుకు తీసుకువెళ్ళారు. నిజామాబాద్ జైలు చాలా ఎత్తై కొండమీద ఉంది. పెద్ద పెద్ద మెట్లు ఎక్కి వెళ్ళాలి. దేవాలయాన్ని నిజాం ప్రభుత్వం జైలుగా మార్చిందంటారు. ఎవరో ఒకర్ని బంధించడానికే రెండూను. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కవిత్వం వ్రాసినందుకు దాశరథిని ఇదే జైల్లో ఉంచారు. రచయితగా నేను రెండోవాడిని. జైల్లో ఒక రాత్రి బాగా జ్వరం వచ్చింది. హాస్పిటల్‌కి తీసుకు వెళ్తామన్నారు. బేడీలు వేస్తామన్నారు. నేను రానన్నాను. తప్పదన్నారు. జ్వరం తీవ్రంగా ఉంది. హాస్పిటలుకు వెళ్ళక తప్పలేదు. నాకు బేడీలు వేసినందుకు డిటెన్యూలంతా బాధపడ్డారు. భారత రక్షణ చట్టం క్రింద మమ్మల్ని అరెస్టు చేశారు; కాబట్టి బెయిలు కోసం దరఖాస్తు పెట్టాము. కోర్టు బెయిలు ఇచ్చింది. బెయిలు ఆర్డరు కంటే ముందుగానే పోలీసు వ్యాన్లు వచ్చాయి జైలుకు. జైలంతా తెలిసిపోయింది మళ్ళీ అరెస్టు చేస్తారని. నాతో మరో ఇద్దర్ని విడుదల చేయమని కోర్టు ఆర్డర్. ముగ్గురమూ కిందికి దిగి వచ్చాం. పోలీసు ఇన్స్పెక్టర్ సరిగ్గా మెట్ల దగ్గర ఉన్నాడు... చుట్టూ సాయుధులైన పోలీసులు... వాళ్ళిద్దర్నీ ఏమీ అనలేదు. నన్నొకణ్ణే అరెస్టు చేశారు... ఈసారి ఆంతరంగిక భద్రతా చట్టం క్రింద. పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్ళారు... కందికుప్ప నుంచి నాన్న వచ్చారు. ఆ రాత్రే తీసుకువచ్చారు చెంచల్గూడా సెంట్రల్ జైలుకు. జ్వరంలోనే తీసుకు వచ్చారు. రాత్రి ఒంటిగంటకు బస్‌లో ప్రయాణం. నాకు రెండు వైపులా తుపాకీలతో పోలీసులు. అరెస్టు అయిన వ్యక్తి కంటే చూసేవాళ్ళు హడలిపోవాలి... అక్కడ దాదాపు సంవత్సరం ఉన్నాను. డిటెన్యూలు రెండు వందల మందిపైగా. వారందరితో జైలు జీవితం చాలా గొప్ప అనుభవం. జైలులో డైరీ వ్రాస్తూ ఉండేవాడిని. మొదటి మూడు నెలలు ఎవర్నీ కలవనివ్వలేదు. ఎవర్నీ చూడడానికి రానివ్వలేదు. ఉత్తరాలు కూడా లేవు. మేమంతా హైకోర్టుకు వెళ్తే ‘నెలకొక వ్యక్తి చూడొచ్చు’ అన్నారు. అదయినా చాలా దగ్గర బంధువు. దానిని కొన్నాళ్ళకు పదిహేను రోజుల కొకసారి చేశారు. ఆ నిర్బంధ వాతావరణంలో వ్యక్తుల మనస్తత్వాలు చాలా చిత్రంగా ఉండేవి. నిర్బంధం, ఒత్తిడి మనస్సుపై ఎంత ప్రభావం చూపుతాయో జైల్లో ప్రత్యక్షంగా చూశాను. ఇద్దరు డిటెన్యూలు చాలా గొప్ప విషయాలు చెప్పారు నాకు. వారి దగ్గర రోజూ కొంతసేపు కూర్చుని నోట్స్ వ్రాసుకున్నాను. ఇంతవరకూ తెలుగు సాహిత్యంలోకి రాని విషయాలు సేకరించాను. గత ఏభై ఏళ్ళ చరిత్ర అది. రెండు ప్రాంతాల గాథలవి. రెండు పోరాట కథలు... చాలా గొప్ప కథలు... ఇద్దరివీ గొప్ప అనుభవాలే... రెండు నవలలుగా వ్రాయాలనుకున్నాను. ఆ నోట్స్ జైల్లో ఉండే స్పెషల్ బ్రాంచ్ పోలీస్ అధికారి కంటబడింది. తీసుకున్నాడు. నా ఎదుటనే కాల్చివేశాడు. ఎంత బాధపడ్డానో చెప్పలేను. మూడు నెలలయిన తర్వాత కొందరం హైకోర్టులో రిట్ వేశాం. కోర్టుకు మమ్మల్ని తీసుకు వెళ్ళేవారు.. బయట ప్రపంచాన్ని చూడటం అదే... చాలా రోజులు విచారణ చేసి విడిచి పెట్టేశారు... కోర్టు బయటికి వస్తుంటేనే పోలీసులు అంటున్నారు... ‘మళ్లీ అరెస్ట్ చేస్తామ’ని. కొందరు కోర్టు నుంచే సరాసరి వెళ్ళిపోయారు. మేం జైలుకు వచ్చాం. గబగబ సర్దుకొని బయటపడ్డాం. ఆ రాత్రి హైద్రాబాద్‌లోనే ఉన్నాను. ఉదయం పోలీసులు వచ్చారు. మళ్ళీ అరెస్ట్ చేశారు. జైలుకు వెళ్ళేసరికి చాలామందిని అప్పటికే తీసుకొచ్చేశారు. మళ్ళీ మామూలు కథే... అలా ఆరు నెలలు గడిచిపోయాయి. ఒక రోజు ఎందుకో హఠాత్తుగా ‘నీతో చెప్పనే లేదు’ అన్న వాక్యాలు వచ్చాయి... వ్రాశాను... ఆ తర్వాత... ఏదో ఆలోచన ఉబికి వచ్చేది... వాక్యాలు తొణికి వచ్చేవి... వ్రాసుకుంటూ వెళ్ళిపోయాను. మిత్రులకు చదివి వినిపిస్తుండే వాడిని. మెచ్చుకొనేవారు. శివుని త్రిశూలంలా ఉండేవి పువ్వులు ఒక చెట్టుకి... ఆ చెట్టు కింద కూర్చుని చదువుకొనేవాణ్ణి. అక్కడే కూర్చుని వ్రాసుకుంటూ ఉండేవాడిని. (సెప్టెంబర్ 16న మరణించిన దళిత, వామపక్ష, పౌరహక్కుల ఉద్యమనేత, న్యాయవాది, రచయిత బొజ్జా తారకం... 1983 మార్చిలో తన కవితా సంకలనం ‘నది పుట్టిన గొంతుక’కు రాసుకున్న ముందుమాటలోంచి...) బొజ్జా తారకం 27 జూన్ 1939 - 16 సెప్టెంబర్ 2016 -
హక్కుల యోధుడికి అశ్రు నివాళి
⇒ కడసారి వీడ్కోలు పలికిన అభిమానులు, ప్రముఖులు ⇒ నివాళులర్పించిన డిప్యూటీ సీఎంలు కడియం, మహమూద్, పలువురు మంత్రులు, వైఎస్సార్సీపీ అధినేత జగన్ సాక్షి, హైదరాబాద్: హక్కుల యోధుడు, ప్రముఖ న్యాయవాది, సాహితీవేత్త బొజ్జా తార కం అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి. శనివారం సాయంత్రం 4.30 గంటలకు రాయదుర్గంలోని వైకుంఠ మహాప్రస్థానం శ్మశానవాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. దళిత, పౌరహక్కుల కార్యకర్త లు, అభిమానులు, వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులు భారీగా తరలివచ్చి హక్కుల సూరీ డుకి అంతిమ వీడ్కోలు పలికారు. ‘నీల్ సలామ్.. నీల్ సలామ్’...‘కోనసీమ ముద్దుబిడ్డ..నీల్ సలామ్..’ ‘బొజ్జా తారకం అమర్ రహే’..‘దళిత ముద్దుబిడ్డ అమర్ రహే..’ అంటూ అభిమానులు నినాదాలు చేశారు. మహప్రస్థానం శక్తిస్థల్‌లోని విద్యుత్ దహనవాటికలో ఆయన కుమారుడు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా, కుటుంబ సభ్యులు అంత్యక్రియలు ముగించారు. అంతకుముందు మధ్యాహ్నం 2.30 గంటలకు బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించా రు. అక్కడ్నుంచి తారకం భౌతికకాయాన్ని మహాప్రస్థానం శ్మశానవాటికకు తరలిం చారు. సీనియర్ ఐఏఎస్ అధికారి సురేంద్రమోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, మెదక్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్, టీఎస్పీఎస్సీ చైర్మన్ చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. తరలివచ్చిన ప్రముఖులు బొజ్జా తారకం భౌతికకాయానికి నివాళి అర్పించేందుకు వివిధ రంగాల ప్రముఖులు, అభిమానులు, రాజకీయ పార్టీలు, ప్రజా సం ఘాల నేతలు, మేధావులు, న్యాయవాదులు, న్యాయమూర్తులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి తరలివచ్చారు. అశోక్‌నగర్‌లోని ఆయన నివాసం నుంచి పార్థివ దేహాన్ని సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి తీసుకువచ్చి ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఉంచారు. వివిధ జిల్లాల నుంచి కూడా పెద్దఎత్తున అభిమానులు రావడంతో సుందరయ్య విజ్ఞాన కేంద్రం పరిసరాలు కిక్కిరిసిపోయాయి. వైఎస్ జగన్ , ప్రముఖుల నివాళి బొజ్జా తారకం భౌతికకాయానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన వెంట పార్టీ నేతలు పార్థసారథి, పినిపె విశ్వరూప్ తదితరులున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు నారుుని నర్సింహారెడ్డి, హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి నివాళులు అర్పించారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఆ పార్టీ శాసన సభాపక్ష నేత జి.కిషన్ రెడ్డి, టీడీపీ రాష్ర్ట అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఐ నేత కె.నారాయణ, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం, జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, విరసం నేత వరవరరావు, ప్రజా గాయకుడు గద్దర్, ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ రామచంద్రమూర్తి తదితరులు తారకం పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. బొజ్జా తారకం మృతిపట్ల సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. -
దళిత ఉద్యమ శిఖరం తారకం
దళిత ఉద్యమ సముత్తేజం, అలుపెరుగని పౌరహక్కుల ఉద్యమ సేనాని, రచయిత, మేధావి, దళిత రాజకీయవేత్త, తెలుగునేల మీద ప్రత్యామ్నాయ సంస్కృతి నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించిన బొజ్జా తారకం (జూన్ 27, 1939-సెప్టెంబర్ 16, 2016) నిర్యాణం దళితులకే కాదు, మానవ హక్కుల ఉద్యమానికే తీరని లోటు. ఈ ఐదు దశా బ్దాల్లో తెలుగునేలలో ఆవిర్భవించిన మేధావుల్లో తారకం ఒకరు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం సమీపంలోని కంది కుప్పలో బొజ్జా మావులమ్మ, అప్పలస్వామి దంపతులకు ఆయన జన్మించారు. అప్పల స్వామి కూడా దళిత రాజకీయ ఉద్యమకారుడే. శ్రీమతి తారకం బొజ్జా విజయభారతి ప్రఖ్యాత కవి బోయి భీమన్న కుమార్తె. ప్రముఖ రచయిత్రి. తారకం గొప్ప మనిషి. ఇంగ్లిష్, తెలుగు భాషల్లో అనర్గళమైన పాండిత్యం ఆయనది. అంబేడ్కర్ రచనలో 1, 4 భాగాల తెలుగు అనువాదానికి సంపాదకత్వం వహించారు. బాబాసాహెబ్ జీవితంలో కీలక ఘట్టాల్ని అనువదించారు. ఆయనకు తెలుగు సాహిత్యం మీద కూడా సాధికారత ఉంది. విరసంలో ఆయన ఉన్న ప్పుడు హిందూ సామ్రాజ్యవా దాన్ని ప్రశ్నించే గ్రంథాలు తీసుకురావాలని వాదించారు. రాజ్యాంగం మీద ఆయనకున్న సాధికారత అసమాన్యమైంది. ‘పోలీసులు అరెస్ట్ చేస్తే’, ‘కులం వర్గం’, ‘నేల- నాగలి- మూడెద్దులు’, ‘పంచతంత్రం’ వంటి రచనలతో బహు ముఖీనమైన కృషి చేశారు. మా ఇద్దరిది నలభై ఏళ్ల బంధం. కారంచేడు దురంతంలో నాతోపాటు ఉద్యమ నిర్మాణంలో పాలుపంచుకుని, దళితులకు స్ఫూర్తి దాత అయ్యాడు. ఆ ఉద్యమంలో సీబీసీఐడీ జ్యుడీ షియల్ ఎంక్వైరీలోకి ప్రధాన ముద్దాయి దగ్గుబాటి చెంచురామయ్య రానప్పుడు ప్రైవేట్ కేసు వేసి ఆయ నను చీరాల కోర్టుకు నడిపించారు. ఉద్యమంలో భాగంగా నేను విశాఖ జైలులో ఉంటే, మా అమ్మ, నా భార్య స్వర్ణకుమారితో కలసి ఎన్.టి. రామారావు ఇల్లు చుట్టుముట్టి పోరాటం చేసి నన్ను విడిపించారు. ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభను రూపొందించే క్రమంలో వందలాది సభల్లో మేమిద్దరం కలసి మాట్లాడాము. 1985 నుంచి 1989 వరకు ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభకు ఆయన అధ్యక్షుడు, నేను ప్రధాన కార్యదర్శిని. దళిత మహాసభ నిర్వహించిన అనేక సభల్లో రాజ్యాంగ హక్కుల గురించి సామాన్య ప్రజలకు అర్థమయ్యే పద్ధతిలో వివ రించేవారు. అంబేడ్కర్ బోధనలను కూడా సరళమైన భాషలో ఆవిష్కరించేవారు. కారంచేడు నుండి దళిత అనే శబ్దాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీల ఐక్యతా శబ్దంగా తీసు కెళ్లటమేకాక ప్రత్యామ్నాయ తత్వవేత్తలైన బుద్ధుడు, మహాత్మాఫూలే, అంబేడ్కర్, పెరి యార్ రామస్వామినాయకర్ ఆలోచనలను ఆంధ్రదేశంలో ముందుకు తీసుకువెళ్లారు. దేశ వ్యాప్తంగా ఉన్న దళిత నాయకులందరినీ మేము ఏకం చేశాం. రామ్‌దాస్ అటాలే (ముంబై), జోగేందర్ కవాడే (నాగ్‌పూర్), దళిత్ ఏలుమలై (తమిళనాడు), సి.ఆర్.దాస్ (కేరళ, కొట్టాయం), భగవాన్‌దాస్ (ఢిల్లీ), ప్రకాశ్ అంబేడ్కర్ (ముంబై) వంటి దళిత మేధావులను, నాయకులను ఆహ్వానించి దళిత స్ఫూర్తిని జాతీయస్థాయికి తీసుకెళ్లడానికి నాతో కలసి తారకం ఎంతో శ్రమించారు. ఆంధ్రదేశంలో దళితులపై జరిగిన దాడుల ఘటనల్లో హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు న్యాయపోరాటం తీసుకువెళ్లడంలో ఆయనది అద్వితీయమైన పాత్ర. నిజామాబాద్ జిల్లాలో అంబేడ్కర్ యువజన సంఘాన్ని నిర్మించి, తెలంగాణ దొరలకు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడారు. హిందూ సామ్రాజ్యవాదానికి ఎదురు తిరగకుండా కమ్యూనిస్టులు ఏమీ సాధించ లేరని దళిత ఉద్యమం తెలియచెప్పగలిగింది. మార్క్సిస్ట్, లెనినిస్టులు, మావోయిస్టులు, మార్క్సిస్ట్ సాంప్రదాయవాదులు దళిత ఉద్యమం బ్రాహ్మణవాదానికి నిజమైన ప్రత్యా మ్నాయం అని తెలుసుకోలేని సందర్భంలో దళిత ఉద్యమం తారకంగారి రచనల ద్వారా, నా రచనల ద్వారా ఒక ప్రత్యామ్నాయ సాంస్కృతిక, సాహిత్య వ్యవస్థని నిర్మించింది. దళిత ఉద్యమ స్ఫూర్తి నుంచే ఎం.ఎల్. పార్టీలో ఉన్న కె.జి.సత్యమూర్తి (శివసాగర్), కంచె ఐలయ్య, ఉ.సాంబశివరావు వంటి మేధావులు దళిత ఉద్యమ సిద్ధాంత కర్తృత్వంలోకి వచ్చారు. 1989లో తారకంగారు, మేము ఆంధ్రదేశానికి బిఎస్పీపీని ఆహ్వానించి బహు జన రాజకీయ ఉద్యమాన్ని విస్తృతం చేయటం జరిగింది. ఆ తర్వాత ఆయన ఆర్.పి.ఐ. రాష్ట్ర బాధ్యతలు స్వీకరించారు. తారకంగారికి భారతదేశ వైరుధ్యాల మీద స్పష్టమైన అవగాహన ఉంది. ఆయన లేని లోటును వారసులు తీర్చగలగాలి. దళిత బహుజన మైనార్టీలను, అగ్రకులాల్లో ఉన్న పేదల్ని, మార్క్సిస్ట్ల్లో వున్న కుల నిర్మూలనావాదుల్ని, మావోయిస్టుల్లో వున్న అంబే డ్కర్వాదులను సమన్వయించి ఒక ఉన్నత రాజకీయ ఉద్యమాన్ని నిర్మించి ఇప్పుడున్న హిందూ సామ్రాజ్యవాద అగ్రకుల రాజ్యాధికారానికి ప్రత్యామ్నాయంగా బౌద్ధ భారతాన్ని రూపొందించటమే ఆయనకిచ్చే ఘనమైన నివాళి. దళితుల రాజ్యాధికారమే ఆయన అంతిమ లక్ష్యం. తారకం- భారత సామాజిక, రాజకీయ వినీలాకాశంలో ఓ నీలిపతాక. డా. కత్తి పద్మారావు వ్యాసకర్త సామాజిక తత్వవేత్త, వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ మొబైల్ : 9849741695 -
బొజ్జా తారకానికి వైఎస్ జగన్ ఘన నివాళి
హైదరాబాద్ : పౌర హక్కుల నేత, రచయిత, ప్రముఖ న్యాయవాది, దళిత ఉద్యమ నేత బొజ్జా తారకానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బొజ్జా తారకం భౌతికకాయాన్ని వైఎస్ జగన్ సందర్శించి, అంజలి ఘటించారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించారు. వైఎస్ జగన్ తో పాటు పార్టీ నేతలు పార్థసారధి, విశ్వరూప్, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి కూడా ఉన్నారు. కాగా సందర్శకుల కోసం బొజ్జా తారకం భౌతికకాయాన్ని సాయంత్రం మూడు గంటల వరకూ ఇక్కడే ఉంచుతారు. నాలుగు గంటలకు ఫిలింనగర్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. గత నాలుగేళ్లుగా బ్రెయిన్ కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన శుక్రవారం రాత్రి 10.20 గంటలకు హైదరాబాద్ అశోక్‌నగర్‌లోని తన స్వగృహంలో మృతి చెందారు. -
అసమానతలు ఉన్నంత కాలం రిజర్వేషన్లు
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: సామాజిక అసమానతలు ఉన్నంత కాలం రిజర్వేషన్లు ఉండాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం. ఎన్ రావ్ అన్నారు. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ సోషల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో బీపీ మండల్ 98వ జయంతి సభ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనకబడిన వర్గాలకు చెందిన ఏ ఒక్క నాయకుడు రిజర్వేషన్ల కోసం పోరాటం చేయలేదన్నారు. అయినా బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత మండల్ కమిషన్‌దేనన్నారు. దేశంలో 52శాతం బీసీలు, 27శాతం ఎస్సీలు, 12శాతం ఎస్టీలు, మైనార్టీలు ఉన్నా రాజ్యాధికారం చేజిక్కించుకోలేకపోతున్నారన్నారు. మాజీ ఎంపీ మధుయాష్కి మాట్లాడుతూ అగ్రవర్ణాల నాయకులు వెనక బడిన వర్గాల వారికి రిజర్వేషన్లు దక్కకుండా కుట్ర చేస్తున్నారన్నారు. సగం తెలంగాణ మాత్రమే సాధించుకున్నామని, దొరలపాలనను అంతమొందించేందుకు ఐక్యంగా ఉద్యమించాలన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సిహెచ్ ప్రభాకర్ మాట్లాడుతూ బీసీ కమిషన్‌ను ఏర్పాటుచేసి బీసీలకు హక్కులు కల్పించాలన్నారు. సింహాద్రి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రొఫెసర్ విశ్వేశ్వర్రావ్, కదిరే కృష్ణ, సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్, చుక్కా సత్తయ్య, రాములు, బాబూరావ్ యాదవ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
గిరిజన హక్కులను కాలరాస్తున్న మోదీ
* తెలంగాణ గిరిజన సంఘం బహిరంగ సభలో బృందాకారత్ సాక్షి, హైదరాబాద్: నరేంద్ర మోదీ ప్రభుత్వం గిరిజనుల హక్కులను కాలరాస్తోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్ విమర్శించారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గిరిజనులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద జరిగిన తెలంగాణ గిరిజన సంఘం బహిరంగసభలో ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అటవీ హక్కుల చట్టాన్ని నీరుగారుస్తోందన్నారు. అధికారంలోకి రాక ముందు స్వర్గాన్ని చూపిస్తానని చెప్పి ఇప్పుడు నరకాన్ని చూపుతున్నారని విమర్శించారు. ప్రాజెక్టుల పేరుతో గిరిజనుల భూములను లాక్కుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయకుంటే సమాజంలో తీవ్రమైన అసమానతలు పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆధిపత్య, పాశ్చాత్య సాంస్కృతిక దాడిలో ఆదివాసీ తెగల సంస్కృతులన్నీ తమ అస్తిత్వాన్ని కోల్పోతున్నాయన్నారు. ఎమ్మెల్యే సున్నం రాజయ్య మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి అనేక మంది ఆదివాసీల జీవితాలను విధ్వంసం చేస్తోందని విమర్శించారు. అంతకు ముందు గిరిజన సాంస్కృతిక సంబరాల్లో భాగంగా ఇందిరా పార్కు నుంచి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వరకు వేలాది మంది గిరిజనులు సంప్రదాయ నృత్యాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. లంబాడీ, గుస్సాడి, థింసా, బుడియబాపు, తీజ్, కోలాటం తదితర సాంస్కృతిక నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం గిరిజనుల ఆరాధ్యమైన సంత్ సేవాలాల్ సినిమాను ప్రదర్శించారు. కార్యక్రమంలో లంబాడా హక్కుల పోరాట సమితి(ఎల్‌హెచ్‌పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు సంజీవ్‌నాయక్, ఎంపీ జితిన్‌చౌదరి, త్రిపుర గిరిజన మంత్రి అఘోరదేవ్ బర్మన్, ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్ చైర్మన్ బజ్‌బాన్ రియాజ్, గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు శ్రీరాంనాయక్, శోభన్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
పోలీసుల అదుపులో వరవరరావు
హైదరాబాద్: విరసం నేత వరవరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాయకీయ ప్రత్యామ్నాయ వేదిక పేరుతో ఆదివారం బాగ్ లింగంపల్లిలోని సుందర్య విజ్ఞాన కేంద్రంలో సభను నిర్వహించాలని విరసం నేతలు భావించారు. కాగా ఆ సభను నిర్వహించేందుకు పోలీసులు అనుమతించలేదు. ఈ నేపథ్యంలో ఎలా అయిన సభను నిర్వహించాలని విరసం నేతలు, కార్యకర్తలు భావించారు. దీంతో గత రాత్రి వరవరరావుతోపాటు దాదాపు 50 మంది విరసం నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. అనంతరం వారందరిని కంచన్‌బాగ్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో ఇతర రాష్ట్రాలకు చెందిన కళాకారులు ఉన్నారు. -
పోలవరం చట్ట విరుద్ధం
గిరిజన ప్రపంచం గుండెపై పోలవరం ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు సుందరయ్య విజ్ఞాన కేంద్రం: ఆదివాసీలను నీట ముంచుతున్న పోలవరం ప్రాజెక్టు చట్ట విరుద్ధమని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ గిరిజన హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గవర్నర్ ఆదివాసీల హక్కులను పట్టించుకోవటం లేదని, అడవులపై వారికి పూర్తి హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష ధోరణిలో వ్యవహరిస్తోందని విమర్శిం చారు. సభలో ప్రొఫెసర్ భంగ్య భూక్యా, డాక్టర్ వీఎన్వీకే శాస్త్రి, గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీరాంనాయక్ పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టును రద్దు చేయాలి హిమాయత్‌నగర్ : ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న గిరిజనులు కనుమరుగయ్యే పరిస్థితులు ఎదురవుతున్నాయని ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు అన్నారు. శనివారం హిమాయత్‌నగర్ చంద్రం బిల్డింగ్‌లో తెలంగాణ రిసోర్స్ సెంటర్ (టీఆర్సీ) ఆధ్వర్యంలో ‘పోలవరం ప్రాజెక్టు-ఆదివాసుల హక్కులు-చట్టాలు’ అన్న అంశంపై జరిగిన చర్చా కార్యక్రమంలో జయధీర్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు గిరిజనుల గుండెపై కుంపటి లాంటిదన్నారు. తమ భాషకు లిపి కావాలని ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో అసలు జాతులనే నాశనం చేయనున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై పునరాలోచన చేయాల్సిన అవసరముందన్నారు. కార్యక్రమంలో చెంచులోకం ప్రతినిధి తోకల గురవయ్య, ఓయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అప్కా నాగేశ్వరరావు, ట్రైబల్ మ్యూజియం క్యూరేటర్ డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ, పీపుల్స్అగెనెస్ట్ పోలవరం ప్రాజెక్టు సోడె మురళి, ఆదివాసీ స్టూడెంట్ యూనియన్ (ఓయూ) అధ్యక్షులు తొడసం పుల్లారావు, ఆదివాసీ స్టూడెంట్ యూనియన్ (కేయూ) అధ్యక్షులు వాసం ఆనంద్ తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పోచన్న ఆధ్వర్యంలో పలువురు గిరిజన కళాకారులు కళారూపాలు ప్రదర్శించారు. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గిరిజనుల భారీ ర్యాలీ ముషీరాబాద్/సుందరయ్యవిజ్ఞాన కేంద్రం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చట్టానికి, రాజ్యాంగానికి, గిరిజనుల ప్రయోజనాలకు విరుద్ధమైనదని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది బొజ్జా తారకం పేర్కొన్నారు. శనివారం పీపుల్స్ ఎగెనెస్ట్ పోలవరం ప్రాజెక్టు ఆధ్వర్యంలో సుందరయ్యవిజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్కు వరకు భారీ ర్యాలీ, అనంతరం ఇందిరాపార్కులో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో విరసం నాయకులు వరవరరావు, న్యూడెమోక్రసీ కె.గోవర్దన్, జార్ఖండ్ ఆదివాసి నాయకులు జితేన్ మరాండి, సోదెం మురళితో కలిసి ఆయన సభలో పాల్గొని ప్రసంగించారు. దాదాపు మూడు లక్షల మంది అమాయక గిరిజనుల పొట్టకొట్టే, నిలువునా ముంచేసే పోలవరం ప్రాజెక్టు అనవరమైనదని చెప్పారు. ఆ ప్రాంత గిరిజనుల ప్రజలంతా మూకుమ్మడిగా వ్యతిరేకిస్తున్నా బలవంతంగా నిర్మిస్తామని ముందుకు రావడం మోడీ ప్రభుత్వ నిరంకుశ, పాసిస్ట్ చర్యగా ఆయన అభివర్ణించారు. గిరిజనులు తమ మనుగడ కోసం విల్లంబులతో యుద్ధానికి దిగితే దానికి ప్రభుత్వాలే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఇంకా ఈ సభలో శాతావాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, రిటైర్డ్ ఇంజినీర్ భీమయ్య, ఆదివాసి మహిళా సంఘం అధ్యక్షురాలు రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్టును నిలిపివేయాలి ఆదివాసీలను జలసమాధి చేసే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ పీపుల్ అగెనెస్ట్ పోలవరం ప్రాజెక్టు(పీఏపీపీ) ఆధ్వర్యంలో శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్కు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలని, ఆదివాసుల హక్కులను కాపాడాలని పెద్ద ఎత్తున నినాదం చేశారు. ఈ సందర్భంగా ఆదివాసి, ప్రజా కళామండలి కళాకారులచే నిర్వహించిన సాంసృ్కతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఆదివాసీలు తమ సంస్కృతిని చాటి చెప్పే విధంగా అలంకరించుకొని చేసిన నృత్యాలు ఆకర్షించాయి. తమ చేతిలో విల్లులను పట్టుకొని చేసిన ప్రదర్శన, దింస నృత్యం ఆక ట్టుకుంది. ఈ ర్యాలీలో పీఏపీపీ జాతీయ నాయకులు జంజర్ల రమేష్ బాబు, జాతీయ కార్యదర్శి సున్నం వెంకటరమణ, తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్ష, కార్యదర్శులు మద్దెలేటి, నలమాస కృష్ణ, విరసం నేత వరవరరావు, సోడె మురళి, టీఎన్జీఓ అధ్యక్షులు దేవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
'రాష్ట్రానికి అన్నీ చేస్తామనడం తప్ప ఏమీ చేయలేదు'
ఆంధ్రప్రదేశ్‌కు అన్నీ చేస్తామనడం తప్ప చంద్రబాబు ప్రభుత్వం చేసేదేమీలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎం.వి.మైసూరారెడ్డి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అతికష్టం మీద రాజధాని నిర్మాణం జరుగుతుంది... కానీ ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందన్న నమ్మకం తనకు లేదని అభిప్రాయపడ్డారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'రాయలసీమకే రాజధాని హక్కు'పై సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా మైసూరారెడ్డి మాట్లాడుతూ...ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సింగపూర్ తరహాలో అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చెబుతున్నారని... అయితే సింగపూర్ నగరం 740 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉందని... అలా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే విస్తీర్ణమైన భూములు కావాలని అన్నారు. రాష్ట్ర రాజధాని ప్రకటన విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తు ప్రకటనలు చేస్తోందని ఆరోపించారు. దీని వల్ల ప్రజలలో ఆందోళనలు రేకెత్తుతున్నాయని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి సలహాలు, సహాయ సహకారాల విషయంలో ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానని మైసూరారెడ్డి స్పష్టం చేశారు. రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాంటే ఒకే అభిప్రాయంతో కమిటీ ముందుకెళ్తే బాగుంటుందని మైసూరారెడ్డి అభిప్రాయపడ్డారు. -
పరిమళించిన మానవత్వం
‘రోడ్డున పడ్డ బంధం’ కథనానికి విశేష స్పందన వృద్ధురాలిని ఆదుకునేందుకు ముందుకొచ్చిన మానవతామూర్తులు ఆశ్రయమిస్తామన్న అభయ ఫౌండేషన్ చేయూతనిస్తానన్న పూరి జగన్నాథ్ సతీమణి సుందరయ్య విజ్ఞానకేంద్రం: ‘రోడ్డున పడ్డ బంధం’ పేరుతో సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన వృద్ధురాలి కథనంపై మానవతావాదులు విశేషంగా స్పందించారు. వృద్ధురాలిని ఆదుకునేం దుకు మేమున్నామంటూ ముందుకు వచ్చారు. సమాజంలో ఇంకా కొంతమంది మానవతామూర్తులున్నారని రుజువు చేశారు. కథనానికి స్పందించిన అభయ ఫౌండేషన్ చైర్మన్ మేడ నర్సింహులు వెంటనే ఫౌండేషన్ కార్యదర్శి బాలచంద్ర, కిరణ్‌కుమార్‌లకు ఫోన్ చేసి ఆమెను చేరదీయాలని చెప్పడంతో.. ఫౌండేషన్ సభ్యులు సుందరయ్య విజ్ఞానకేంద్రానికి సాక్షి దినపత్రికను పట్టుకొని ఆమెను వెతుక్కుంటూ వచ్చారు. వృద్ధురాలిని తమ వెంట రావాలని కోరుతున్న తరుణంలోనే.. ప్రముఖ సినీ దర్శకులు పూరి జగన్నాథ్ సతీమణి లావణ్య సైతం ఆమెను ఆదుకోవడానికి అదే సమయంలో అక్కడికి వచ్చారు. దీంతో అభయ ఫౌండేషన్ సభ్యులు, లావణ్య కలిసి వృద్ధురాలు దుర్గమ్మను ఇబ్రహీంపట్నంలోని ఫౌండేషన్ ఆశ్రమానికి తీసుకెళ్లారు. అయితే లావణ్య ఆమెకయ్యే ఖర్చులను తాను భరిస్తానని, 50 వేల రూపాయలను ఫౌండేషన్‌కు విరాళంగా ఇచ్చారు. అంతేకాదు ప్రతి నెలా ఆమెకయ్యే ఖర్చును తాను భరిస్తానన్నారు. ఇదిలా ఉండగా కృష్ణానగర్‌లో నివసించే దుర్గమ్మ కూతురైన సుబ్బలక్ష్మి, అల్లుడు రాజేష్ కుమార్ ‘సాక్షి’లో వచ్చిన దుర్గమ్మ కథనాన్ని చూసి తమ కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు కూడా దుర్గమ్మను వెతకడం ప్రారంభించారు. అయితే అప్పటికే ఆమెను అభయ ఫౌండేషన్‌కు తీసుకొచ్చారని తెలుసుకొని, ఆమెను ఇంటికి తీసుకెళ్లడానికి మెహిదీపట్నంలోని ఫౌండేషన్ కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా సుబ్బలక్ష్మి మాట్లాడుతూ ఐదు నెలల క్రితం తన తల్లి దుర్గమ్మ ఇంటి వద్ద నుంచి తప్పిపోయిందని, ఎంత వెతికినా ఆచూకీ లభించలేదని తెలిపారు. అయితే అదే సమయంలో తన కూతురు పెళ్లి కావడంతోపాటు తన భర్త రామారావుకు యాక్సిడెంట్ అయి తీవ్ర గాయాల పాలు కావడంతో కొంత అశ్రద్ధ చేశామన్నారు. తన తల్లి గత 20 ఏళ్ల నుంచి తన దగ్గరే ఉంటుందని, ఇక నుంచి ఆమెను జాగ్రత్తగా చూసుకుంటానని, కన్నీటి పర్వమయ్యారు. ఫౌండేషన్ సభ్యులు దుర్గమ్మ కూతురుతో హామీపత్రం రాయించుకొని ఆమెతో పంపడానికి అంగీకరించారు. అయితే పూరి జగన్నాథ్ భార్య లావణ్య స్వయాన తన కారులో ఇబ్రహీంపట్నంలోని ఆశ్రమానికి కారును పంపించి వృద్ధురాలు దుర్గమ్మను కృష్ణానగర్‌లోని సుబ్బలక్ష్మి ఇంట్లో దించారు. ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ భార్య లావణ్య మాట్లాడుతూ.. తనకు సమాజ సేవ అంటే చిన్నప్పటి నుంచీ ఇష్టమని, తన భర్త ప్రోత్సాహంతో ఇలాంటి సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నానన్నారు. -
ఏమో పీఎం అవుతారేమో !
హైదరాబాద్: దేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతి, కుంభకోణాలపై యుద్ధం చేసినందు వల్లే ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీలో స్వల్పకాలంలోనే అధికారంలోకి వచ్చిందని.. పరిస్థితి ఇలాగేవుంటే ఆ పార్టీ అభ్యర్థి ప్రధానమంత్రి అయినా ఆశ్చర్యపోవాల్సిన పన్లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు వెల్లడించారు. అయితే ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న పార్టీలే అధికారంలో ఉంటాయని స్పష్టంచేశారు. గురువారం రాత్రి సుందరయ్యవిజ్ఞాన కేంద్రంలో పీపుల్ అగెనెస్ట్ కరప్షన్ ఆధ్వర్యంలో ‘ఆమ్ఆద్మీ పార్టీ గెలుపు-ఒక పరిశీలన’ అన్న అంశంపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కులాన్ని, మతాన్ని, డబ్బు, మద్యాన్ని పక్కనబెట్టి ఆమ్ఆద్మీ పార్టీని గెలిపించారని గుర్తుచేశారు. అయితే రాష్ట్రంలో వామపక్షాలు కూడా కరెంటు,నీటి సమస్యలకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేసినప్పటికీ ప్రజలు ఆప్‌కు దగ్గరకావడం నూతన ప్రచార సాధనాలను వినియోగించడంతోపాటు ఎక్కువగా మీడియాను ఉపయోగించారని చెప్పారు. మాజీఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీల పాలనలో వ్యత్యాసం లేకపోవడం వల్లే ప్రజలు విసుగుచెంది ప్రత్యామ్నాయంగా ఆప్‌ను గెలిపించారన్నారు. పీపుల్ అగెనెస్ట్ కరప్షన్ కన్వీనర్ డాక్టర్ రాజేందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పురేందరప్రసాద్ పాల్గొన్నారు.