హైదరాబాద్: విరసం నేత వరవరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాయకీయ ప్రత్యామ్నాయ వేదిక పేరుతో ఆదివారం బాగ్ లింగంపల్లిలోని సుందర్య విజ్ఞాన కేంద్రంలో సభను నిర్వహించాలని విరసం నేతలు భావించారు. కాగా ఆ సభను నిర్వహించేందుకు పోలీసులు అనుమతించలేదు.
ఈ నేపథ్యంలో ఎలా అయిన సభను నిర్వహించాలని విరసం నేతలు, కార్యకర్తలు భావించారు. దీంతో గత రాత్రి వరవరరావుతోపాటు దాదాపు 50 మంది విరసం నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. అనంతరం వారందరిని కంచన్బాగ్ పోలీసు స్టేషన్కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో ఇతర రాష్ట్రాలకు చెందిన కళాకారులు ఉన్నారు.