'రాష్ట్రానికి అన్నీ చేస్తామనడం తప్ప ఏమీ చేయలేదు' | M.V.Mysoora reddy takes on Chandrababu naidu | Sakshi
Sakshi News home page

'రాష్ట్రానికి అన్నీ చేస్తామనడం తప్ప ఏమీ చేయలేదు'

Published Sun, Jul 6 2014 1:35 PM | Last Updated on Fri, May 25 2018 9:17 PM

మైసూరా రెడ్డి - Sakshi

మైసూరా రెడ్డి

ఆంధ్రప్రదేశ్కు అన్నీ చేస్తామనడం తప్ప చంద్రబాబు ప్రభుత్వం చేసేదేమీలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎం.వి.మైసూరారెడ్డి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అతికష్టం మీద రాజధాని నిర్మాణం జరుగుతుంది... కానీ ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందన్న నమ్మకం తనకు లేదని అభిప్రాయపడ్డారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'రాయలసీమకే రాజధాని హక్కు'పై సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా మైసూరారెడ్డి మాట్లాడుతూ...ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సింగపూర్ తరహాలో అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చెబుతున్నారని... అయితే సింగపూర్ నగరం 740 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉందని... అలా రాష్ట్రం అభివృద్ధి
చెందాలంటే విస్తీర్ణమైన భూములు కావాలని అన్నారు.

 

రాష్ట్ర రాజధాని ప్రకటన విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తు ప్రకటనలు చేస్తోందని ఆరోపించారు. దీని వల్ల ప్రజలలో ఆందోళనలు రేకెత్తుతున్నాయని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి సలహాలు, సహాయ సహకారాల విషయంలో ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానని మైసూరారెడ్డి స్పష్టం చేశారు. రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాంటే ఒకే అభిప్రాయంతో కమిటీ ముందుకెళ్తే బాగుంటుందని మైసూరారెడ్డి అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement