M.V.Mysoora reddy
-
'రాష్ట్రానికి అన్నీ చేస్తామనడం తప్ప ఏమీ చేయలేదు'
ఆంధ్రప్రదేశ్‌కు అన్నీ చేస్తామనడం తప్ప చంద్రబాబు ప్రభుత్వం చేసేదేమీలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎం.వి.మైసూరారెడ్డి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అతికష్టం మీద రాజధాని నిర్మాణం జరుగుతుంది... కానీ ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందన్న నమ్మకం తనకు లేదని అభిప్రాయపడ్డారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'రాయలసీమకే రాజధాని హక్కు'పై సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా మైసూరారెడ్డి మాట్లాడుతూ...ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సింగపూర్ తరహాలో అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చెబుతున్నారని... అయితే సింగపూర్ నగరం 740 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉందని... అలా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే విస్తీర్ణమైన భూములు కావాలని అన్నారు. రాష్ట్ర రాజధాని ప్రకటన విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తు ప్రకటనలు చేస్తోందని ఆరోపించారు. దీని వల్ల ప్రజలలో ఆందోళనలు రేకెత్తుతున్నాయని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి సలహాలు, సహాయ సహకారాల విషయంలో ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానని మైసూరారెడ్డి స్పష్టం చేశారు. రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాంటే ఒకే అభిప్రాయంతో కమిటీ ముందుకెళ్తే బాగుంటుందని మైసూరారెడ్డి అభిప్రాయపడ్డారు. -
ఉద్యమాన్ని నీరుగార్చేలా సీఎం వ్యవహరిస్తున్నారు
-
న్యాయస్థానంలో న్యాయమే గెలిచింది: మైసూరారెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరప తలపెట్టిన 'సమైక్య శంఖారావం' సభకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనుమతి ఇవ్వడం పట్ల ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఎం.వి.మైసూరారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఆయన మాట్లాడుతూ... సభకు అనుమతి ఇవ్వడం ద్వారా న్యాయస్థానంలో న్యాయం గెలిచిందన్నారు. న్యాయం ఇంకా బతికే ఉందనడానికి హైకోర్టు ఇచ్చిన తీర్పే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. సమైక్య శంఖారావం సభ ఎవరికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టడానికి అంతకన్నా కాదన్నారు. దేశం, రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడే అభివృద్ధి చెందుతాయని చెప్పడమే సమైక్య శంఖారావం ముఖ్య ఉద్దేశ్యమని మైసూరారెడ్డి పేర్కొన్నారు. సమైక్య శంఖారావం సభకు ప్రభుత్వం అనుమతించక పోవడంపై ఆయన ఈ సందర్భంగా స్పందించారు. రాజ్యాగ్యం కల్పించిన భావ ప్రకటన స్వేచ్చను.. ప్రభుత్వం కాలరాయాలనుకోవడం దురదృష్టకరమని మైసూరారెడ్డి అభిప్రాయపడ్డారు. -
న్యాయస్థానంలో న్యాయమే గెలిచింది: మైసూరారెడ్డి