దేవుడే మీకు తగిన శాస్తి చేస్తాడు | MLA Roja Says God will Punish Chandrababu | Sakshi
Sakshi News home page

Published Sun, Jan 7 2018 11:32 AM | Last Updated on Mon, Oct 29 2018 8:10 PM

MLA Roja Says God will Punish Chandrababu - Sakshi

సాక్షి, చిత్తూరు : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రకు వస్తున్న స్పందన ఓర్వలేకే ఏపీ సీఎం చంద్రబాబు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజా తెలిపారు. చంద్రబాబు సొంత జిల్లా(చిత్తూరు)లో వైఎస్‌ జగన్‌ అడుగులు పడుతుంటే.. అవి చంద్రబాబు గుండెల్లో దిగుతున్నాయని ఆమె అన్నారు. ఆదివారం ఉదయం చిత్తూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. 

వార్డు మెంబర్‌గా కూడా గెలవని నారా లోకేష్‌ కోసం చంద్రబాబు దేవాలయాలన్నింటిని అప్రతిష్టపాలు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. వనజాక్షి, పుష‍్కరాల తొక్కిసలాట విచారణ మాదిరిగానే.. దుర్గ గుడిలో తాంత్రిక పూజల వ్యవహారాన్ని పక్కదారి పట్టిస్తున్నారని.. ఈవోపై నెపం నెట్టేసి తప్పించుకునే యత్నాలు చేస్తున్నారని రోజా చెప్పారు. ‘‘పూజలు జరిగినట్లు సాక్షాత్తూ పాలక మండలే అంగీకరించింది. ఒక్క దుర్గ గుడిలోనే కాదు. ఇతర ఆలయాల్లో కూడా పూజలు చేశారు. హిందూ సాంప్రదాయాలను అవమానపరుస్తున్న చంద్రబాబుకు దేవుడే తగిన శాస్తి చేస్తాడు’’ అని ఆమె తెలిపారు.
 
‘ఓటర్లు సిగ్గుపడాలి.. మత్స్యకారుల తాట తీస్తా’ అని చంద్రబాబు బెదిరించడం దారుణమని రోజా అన్నారు. ఇక ఓవైపు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ప్రజల ఆశీర్వాదంతో ప్రజాసంకల్పయాత్ర ముందుకు కొనసాగిస్తుంటే... మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం పోలీసుల సహకారంతో జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారని ఆమె ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇష్టం లేకపోయినా.. వారిని బలవంతం చేసి జన్మభూమికి తరలిస్తున్నారని రోజా చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement