
సాక్షి, శ్రీకాకుళం: వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రాత్మక ప్రజాసంకల్పయాత్రను విజయవంతం చేసిన ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఆ పార్టీ సీనియర్ నాయకులు తమ్మినేని సీతారాం ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పాదయాత్ర దేశ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. వైఎస్ జగన్ అంటే ఓ పోరాటం, ఒక నమ్మకం, పాదయాత్ర ద్వారా ప్రజలకు భరోసా కల్పించిన నాయకుడని అని వ్యాఖ్యానించారు.
వైఎస్ జగన్ పాదయాత్రను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అవినీతి, అక్రమాలపై విజయంగా భావిస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన టీడీపీని చంద్రబాబు కాంగ్రెస్ వాళ్ల కాళ్ళ వద్ద పెట్టి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని మండిపడ్డారు. అటువంటి చంద్రబాబుకు తెలుగు ప్రజలు బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment