
సమావేశంలో మాట్లాడుతున్న నాగేశ్వర్‌రావు
సుందరయ్యవిజ్ఞానకేంద్రం: తెలంగాణ మెడికల్, సేల్స్ రిప్రజెంటీవ్స్ యూనియన్(టీఎమ్‌ఎస్‌ఆర్‌యూ) రాష్ట్ర మహాసభలను ఈ నెల 19 నుంచి రెండు రోజుల పాటు సుందరయ్యవిజ్ఞానకేంద్రంలో నిర్వహిస్తున్నట్లు యూనియన్ సంయుక్త ప్రధాన కార్యదర్శి ఏ.నాగేశ్వర్‌రావు తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. మహాసభలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఎ.నర్సిరెడ్డి, సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్, ఎఫ్‌ఎంఆర్‌ఏఐ అధ్యక్షుడు రమేష్ సుందర్ తదితరులు పాల్గొంటారని తెలిపారు.
మందులు, వైద్య రంగంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సదస్సులో చర్చించనున్నట్లు తెలిపారు. సమావేశంలో పి.మురళీ, టీఎంఎస్‌ఆర్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ.రాజు భట్, కార్యదర్శి సునీల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.