
విచారణ నిర్వహిస్తున్న అధికారులు
సాక్షి, బోనకల్ ఖమ్మంజిల్లా : మండలంలోని రావినూతల గ్రామంలో రెండు నెలల చిన్నారి దత్తతపై గ్రామస్తుల ఫిర్యాదుతో వివాదం నెలకొంది. గ్రామానికి చెందిన దారెల్లి సునీల్, ఉషారాణి దంపతులకు ఐదుగురు కుమార్తెలున్నారు.
రెండు నెలల క్రితం పుట్టిన ఐదవ కుమార్తెను కృష్ణా జిల్లా నందిగామ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన జిల్లేపల్లి భీమయ్య, సంధ్య దంపతులకు దత్తత ఇచ్చేదుకు రాసుకున్న ఒప్పందంలో చిన్నారి సంరక్షణకు అర ఎకరం పొలం ఇచ్చేటట్లు అంగీకరించారు.
ఈ నెల 9న చిన్నారిని భీమయ్య దంపతులు తీసుకెళ్లారు. చిన్నారికి ఇస్తనన్న పొలం విషయంలో సమస్య రావడంతో పాటు గ్రామంలో చిన్నారి వ్యవహారంపై చర్చ జరిగి కొందరు 1098కు ఫిర్యాదు చేశారు.
దీంతో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ మాలతి, 1098 అధికారి నాగమణి, పోలీసు సిబ్బంది రావినూతలలో సోమవారం విచారణ నిర్వహించారు. పాప తల్లిదండ్రులను వివరాలు అడిగి మంగళవారం పాపను ఐసీడీఎస్ కార్యాలయానికి తీసుకు రావాలని ఆదేశించారు.