
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా (82) ఎక్కువగా సామాజిక సమస్యలపై స్పందిస్తుంటారు. తాజాగా ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. పది నెలల వయసున్న ఓ శునకాన్ని ఎవరైనా దత్తత తీసుకోవాలని ఆయన కోరారు. ‘ఈ శునకం పేరు సూర్. ఇప్పటికే దీనిని చాలా మంది దత్తత తీసుకున్నారు. కానీ, ఇప్పుడది ఒంటరి అయింది. సూర్‌ని ఎవరైనా దత్తత తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. లేదంటే మీకు తెలిసిన ఎవరైనా దీనిని దత్తత తీసుకునేందుకు సహకరించండి. గతంలో ఇలాగే ఓసారి మైరా అనే శునకానికి సంబంధించి పోస్టు పెడితే నన్ను ఫాలో అవుతున్న వాళ్లు ఆ శునకానికి మేలు చేశారు’ అని టాటా పేర్కొన్నారు.
సూర్‌కు ఆశ్రయం కల్పించాలనే మంచి ఆలోచన కలిగిన వారు తన ఇన్‌స్టాగ్రామ్ లింక్‌లో పోస్ట్ చేయాలంటూ టాటా తెలిపారు. మైరాలాగే సూర్‌కు కూడా మంచి ఫ్యామిలీ దొరుకుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక టాటా పోస్టుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఎప్పుడూ తన వ్యాపారంలో బిజీగా ఉండే టాటా సామాజిక సమస్యలపై స్పందించే తీరు అభినందనీయమని ప్రశంసిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment