సాక్షి, హైదరాబాద్: దత్తత వెళ్లక ముందు సొంత (పుట్టిన) తల్లిదండ్రులు ఏదైనా ఆస్తిని కేటాయించి ఉంటే దానిపై దత్తత వెళ్లిన వ్యక్తికి హక్కులు ఉంటాయి తప్ప.. దత్తత వెళ్లిన అనంతరం ఎలాంటి హక్కులు ఉండవని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తేల్చిచెప్పింది. దత్తత తీసుకున్న తల్లిదండ్రుల ఆస్తికి మాత్రమే వారసుడవుతారని వ్యాఖ్యానించింది. దత్తత వెళ్లిన తర్వాత సొంత తల్లిదండ్రులతో ఎలాంటి సంబంధం ఉండదని చెప్పింది. అలాంటప్పుడు వారి ఆస్తికి వారసులు కాలేరని స్పష్టం చేసింది.
దత్తతకు సంబంధించి దాఖలైన ఓ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. దత్తత వెళ్లినప్పటికీ తనకు సొంత తల్లిదండ్రుల కుటుంబ ఆస్తిలో వాటా ఉంటుందంటూ ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలానికి చెందిన ఏవీఆర్‌ఎల్ నరసింహారావు కింది కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు సొంత తల్లిదండ్రుల ఆస్తిలో వాటా ఉంటుందని తీర్పునిచ్చింది.
దీన్ని సవాల్ చేస్తూ అతని సోదరుడు ఎ.నాగేశ్వరరావు హైకోర్టులో లెటర్స్ పేటెంట్ అప్పీల్ దాఖలు చేశారు. దీని విచారణకు ప్రధాన న్యాయమూర్తి ఫుల్ బెంచ్ ఏర్పాటు చేశారు. విచారణ చేపట్టిన జస్టిస్ పి.నవీన్‌రావు, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి, జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది.
చదవండి: డ్రైవింగ్‌లో ‘భ్రాంతి’ ముప్పు!.. 50% రోడ్డు ప్రమాదాలకు కారణమిదే!
Comments
Please login to add a commentAdd a comment