Host, Actress Anusha Dandekar Adopts Baby Girl, Share Photos - Sakshi
Sakshi News home page

Anusha Dandekar: లవ్‌ బ్రేకప్‌.. దత్తత ద్వారా తల్లయిన నటి

Published Fri, Jun 3 2022 6:02 PM | Last Updated on Fri, Jun 3 2022 7:26 PM

Host, Actress Anusha Dandekar Adopts Baby Girl, Share Photos - Sakshi

బుల్లితెర నటి, యాంకర్‌, సింగర్‌ అనూష దండేకర్‌ ఓ శుభవార్తను అభిమానులతో పంచుకుంది. ఓ ఆడపిల్లను దత్తత తీసుకున్నట్లు సోషల్‌ మీడియాలో వెల్లడించింది. తాను అమ్మనయ్యానంటూ సంతోషం వ్యక్తం చేసింది. 'ఈ చిన్నారి ఏంజెల్‌ సహారా నా సొంతం' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో కూతురితో కలిసి దిగిన ఫొటోలు, వీడియోలు షేర్‌ చేసింది. ఇందులో కూతురి కళ్లలోకి చూస్తూ అమ్మతనాన్ని ఆస్వాదిస్తోంది అనూష. అలాగే తన కుటుంబంలో భాగమైన చిన్నారితో సరదాగా ఆడుకుంటూ కనిపించింది. పెళ్లి కాకుండానే కూతురిని దత్తత తీసుకుని తల్లయిన నటికి అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కాగా అనూష గతంలో నటుడు కరణ్‌ కుంద్రాతో ప్రేమాయణం నడిపింది. కానీ వీరి బంధం ఎంతోకాలం నిలబడలేదు. ఆ తర్వాత మోడల్‌ జాసన్‌ షాను ప్రేమించింది. వీరిద్దరూ తమ ప్రేమను అధికారికంగా ప్రకటించారు కూడా! కానీ గతేడాది జాసన్‌ సోషల్‌ మీడియాలో అనూష ఫొటోలను తొలగించడంతో వీరు కూడా విడిపోయినట్లు వార్తలు వచ్చాయి.

చదవండి: డబ్బు చాలా అవసరమైంది, అందుకే వాటికి ఒప్పుకున్నాను
డాక్టర్‌ స్ట్రేంజ్‌ మల్టీవర్స్‌ ఆఫ్‌ మ్యాడ్‌నెస్‌ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement