![Karate Kalyani Child Adoption Case: Actor Attends For Hearing At Collector Office - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/17/karate-kalyani.jpg.webp?itok=BMO38U_r)
అక్రమంగా చిన్నారిని దత్తత తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కరాటే కల్యాణి హైదరాబాద్ కలెక్టర్ కార్యాయలంలో విచారణకు హాజరయ్యింది. కల్యాణీతో పాటు చిన్నారి తల్లిదండ్రులు కూడా సీడబ్లూసీ విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం కరాటే కల్యాణి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నారికి సంబంధించి ఇంత వరకూ ఎలాంటి దత్తత జరగలేదని పేర్కొంది.
ఇదే విషయాన్ని కలెక్టర్ ముందు కూడా చెప్పామని వివరించింది. 'ఆర్థికంగా చిన్నారి తల్లిదండ్రులకు అండగా ఉన్నాను. నాపై బురద జల్లేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో ఎంత మాత్రం వాస్తవం లేదు' అంటూ కరాటే కల్యాణి చెప్పుకొచ్చింది. కాగా యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డితో వివాదం, ఆ తర్వాత చిన్నారి దత్తత విషయం హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే.
ప్రభుత్వ అనుమతి లేకుండా చిన్నారులను తన ఇంట్లో ఉంచిందని కరాటే కల్యాణిపై ఫిర్యాదు రావడంతో చైల్డ్ లైన్ అధికారులు కరాటే కల్యాణి ఇంట్లో సోదాలు నిర్వహించారు. నోటీసులకు స్పందిచకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ పరిణామాల అనంతరం కరాటే కల్యాణి అఙ్ఞాతంలోకి వెళ్లడం, ఆమె ఫోన్ స్విచ్చాఫ్ కావడం వంటి నాటకీయ పరిణామాలు చర్చనీయాంశమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment