
సాక్షి బెంగళూరు: ప్రసవ సమయంలో మహిళా ఉద్యోగులకు ఇచ్చే మెటర్నిటీ సెలవును ఇకపై పిల్లలను దత్తత తీసుకున్నావారికీ ఇవ్వనున్నారు. పిల్లలను దత్తత తీసుకున్న మహిళా ఉద్యోగికి 180 రోజులు, పురుష ఉద్యోగికి 15 రోజులు సెలవు లభించనుంది. చిన్నారిని దత్తత తీసుకున్న రోజునుంచే సెలవు అన్వయమవుతుంది. ప్రభుత్వ నియమాలప్రకారం ఇద్దరు పిల్లల దత్తతవరకే ఆ సెలవుకు అవకాశంఉంటుంది.