Maternity leaves
-
డిగ్రీ, పీజీ ప్రెగ్నెంట్ విద్యార్థులకు ప్రసూతి సెలవులు మంజూరు
కేరళలో తొలిసారిగా మహాత్మగాంధీ విశ్వవిద్యాలయం ప్రెగ్నెంట్ విద్యార్థులకు 60 రోజుల ప్రసూతి సెలవులు మంజూరు చేసింది. అందవుల్ల వారు ఎలాంటి ఆటంకం లేకుండా చదువును కొనసాగించవచ్చునని పేర్కొంది. ఈ మేరకు వైస్ ఛాన్సలర్ సీటీ అరవింద కుమార్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన సిండికేట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రసూతి సెలవులు ప్రసవానికి ముందు లేదా తర్వాత తీసుకోవచ్చునని తెలిపింది. అది కూడా మొదటి లేదా రెండవ గర్భధారణకు.. కోర్సు వ్యవధిలో ఒకసారి మాత్రమే మంజూరు చేయబడుతుందని పేర్కొంది. అలాగే సెలవుల వ్యవధిలో ఒక్కొసారి పబ్లిక్ సెలవులు, సాధారణ సెలవులను ఉంటాయని, ఐతే ఆ సెలవులతో దానితో కలపమని తెలిపింది. అంతేగాదు అబార్షన్, ట్యూబెక్టమీ తదితర సందర్భాల్లో సుమారు 14 రోజుల సెలవు మంజూరు చేయబడుతుందని పేర్కొంది. పైగా ప్రెగ్నెన్సీ కారణంగా విద్యార్థుల చదువుకు ఆటంకం ఏర్పడకుండా...ఒక సెమిస్టర్లో ప్రసూతి సెలవులు తీసుకుంటున్నవారు ఆ సెమిస్టర్లో పరీక్షల కోసం నమోదు చేసుకోవడానికి అనుమతించడం జరుగుతుంది. అయితే తదుపరి సెమిస్టర్లో రెగ్యులర్ విద్యార్థుల తోపాటు దానిని సప్లిమెంటరీగా రాయవచ్చు. అందువల్ల వారు సెమిస్టర్ కోల్పోరు. ఎందుకంటే వారి ప్రసూతి సెలవు ముగిసిన తర్వాత తమ బ్యాచ్వారి తోపాటు తర్వాత సెమిస్టర్లను కొనసాగించవచ్చు అని యూనివర్సిటీ స్పష్టం చేసింది. ఈ ప్రసూతి సెలవుల్లో ఉన్న విద్యార్థులకు ప్రాక్టికల్, ల్యాబ్, వైవా పరీక్షలు ఉన్నట్లయితే సంస్థ లేదా విభాగాధిపతి ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సిండికేట్ కమిటీ నిర్ణయించింది. ఈ సెలవులు పొందేందుకు మూడు రోజుల ముందు దరఖాస్తుతోపాటు మెడికల్ సర్టిఫికేట్‌ను సమర్పించాలని పేర్కొంది. (చదవండి: అలా చేయకండి.. బలవంతంగా కొనిపించడం కరెక్ట్ కాదు) -
ప్రసవంలో బిడ్డ మరణిస్తే.. 60 రోజుల ప్రత్యేక సెలవులు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగుల కోసం మరో కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రసవం సమయంలో బిడ్డ గనుక మరణిస్తే.. ఆ తల్లులకు 60 రోజుల ప్రత్యేక ప్రసూతి సెలవులు ఇవ్వనున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ప్రసవం సమయంలోగానీ లేదంటే పుట్టిన కాసేపటికే గానీ బిడ్డ చనిపోతే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే మహిళా ఉద్యోగులకు ఈ సెలవులు వర్తిస్తాయని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(DoPT) శుక్రవారం తన ఆదేశాల్లో వెల్లడించింది. బిడ్డ పుట్టిన వెంటనే చనిపోతే.. ఆ తల్లి జీవితంపై తీవ్ర ప్రభావం పడుతుందని, అందువల్ల కలిగే మానసిక క్షోభను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీవోపీటీ ఆ ప్రకటనలో తెలిపింది. ప్రసవ సమయంలో బిడ్డ చనిపోవడం, మెటర్నీటీ లీవుల విషయంలో చాలామంది ఉద్యోగులు ఎంక్వైరీలు, విజ్ఞప్తులు చేస్తున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ అంశంపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో సంప్రదించాకే ఆదేశాలు ఇస్తున్నట్లు ప్రకటించింది డీవోపీటీ. ఒకవేళ మెటర్నీటీ లీవులు గనుక ఉంటే.. అవి వర్తిస్తాయని, అవి అందుబాటులో లేకుంటే 60 రోజుల ప్రత్యేక మెటర్నిటీ లీవులు వర్తిస్తాయని(బిడ్డ మరణించిన నాటి నుంచి) సదరు ప్రకటన తెలిపింది. అలాగే బిడ్డ పుట్టిన వెంటనే మరణించే పరిస్థితిని పుట్టిన 28 రోజుల వరకు నిర్వచించవచ్చని అన్ని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/విభాగాలకు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రత్యేక ప్రసూతి సెలవుల ప్రయోజనం.. ఇద్దరు పిల్లల కంటే తక్కువ సంతానం ఉన్న కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగికి, అథరైజ్డ్ ఆస్పత్రిలో పిల్లల ప్రసవం జరిగితేనే వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (CGHS) కింద గుర్తింపు ఉన్న ప్రైవేట్ లేదంటే ప్రభుత్వాసుపత్రిలో మాత్రమే ప్రసవం జరగాల్సి ఉంటుంది. ఒకవేళ ఎంప్యానెల్ లేని ప్రైవేట్ ఆసుపత్రిలో అత్యవసర ప్రసవాలు జరిగితే, అత్యవసర ధృవీకరణ పత్రం తప్పనిసరి అని పేర్కొంది. ఇదీ చదవండి: బాహుబలి.. ఐఎన్ఎస్ విక్రాంత్ -
కారుణ్యం.. దారుణం..బట్టబయలు చేసిన మెటర్నిటీ దరఖాస్తు
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ నిర్లక్ష్యమనాలో..నిద్రమత్తు అనాలో కానీ..గుడ్డిగా వ్యవహరిస్తున్న తీరుకు ఇదో మచ్చు తునక. ఓ మహిళ తనకు వివాహం కాలేదని చెప్పి..ఏకంగా కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం పొందినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆమె మెటర్నిటీ ఖర్చుల రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకున్న సమయంలో ఈ అంశాన్ని గుర్తించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే...ఆరోగ్యం–పారిశుధ్యం విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మహిళాఉద్యోగి ఒకరు మెటర్నిటీ ఖర్చుల రీయింబర్స్మెంట్ నిమిత్తం చేసుకున్న దరఖాస్తును జీహెచ్ఎంసీలోని సంబంధిత అధికారులు వాటిని చెల్లించే రాష్ట్రస్థాయి వైద్య విభాగానికి పంపించారు. ఫైలును పరిశీలించిన సదరు విభాగం మెటర్నిటీ ప్రయోజనాలను రెండు కాన్పుల వరకు మాత్రమే పొందే అవకాశం ఉందని, ఆమెకది నాలుగో కాన్పు అయినందున నిధులివ్వడం కుదరదని, ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించినందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్‌కు ఫైలును తిప్పి పంపినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో..అసలు ఆమె ఉద్యోగంలో చేరడమే అక్రమ మార్గంలో చేరిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కారుణ్య నియామకం కింద రెండేళ్ల క్రితం ఉద్యోగంలో చేరిన ఆమె తనకు వివాహం కాలేదని పేర్కొంటూ ఉద్యోగం పొందినట్లు వినిపిస్తోంది. ఇప్పుడు మెటర్నీటీ ప్రయోజనం పొందేందుకు ఆస్పత్రి సేవల ఖర్చులకు సంబంధించిన రికార్డులు, బిల్లులు జతచేయడంతో వాటిని పరిశీలించిన సంబంధిత విభాగం నాలుగోకాన్పుగా గుర్తించింది. కారుణ్య నియామకాలకు సంబంధించి కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణించినప్పుడు వారి సంతానంలో ఎవరో ఒకరికి ఉద్యోగం ఇవ్వవచ్చునని, అమ్మాయిలైతే వివాహం కాని వారికి వర్తిస్తుందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. మిగతా సంతతి నిరభ్యంతరం కూడా అందుకు అవసరం.ఈ నేపథ్యంలో అసలు ఆమె నియామకమే అక్రమంగా జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈ వ్యవహారంపై విజిలెన్స్ విభాగం ద్వారా విచారణ జరిపించేందుకు అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అంధ పాలన ఎన్నాళ్లు..? ఈ నేపథ్యంలో, జీహెచ్ఎంసీలోని ఉన్నతాధికారులు ఎన్నాళ్లు అంధ పాలన సాగిస్తారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇతర ప్రభుత్వ విభాగాల నుంచి జీహెచ్ఎంసీకి డిప్యుటేషన్‌పై వచ్చి మూడేళ్లకు తిరిగి వెళ్లాల్సి ఉండగా, ఐదేళ్లు దాటినా.. ఆ తర్వాత సైతం జీహెచ్ఎంసీయే సొంత డిపార్ట్మెంట్లా పాతుకుపోయిన వారి విషయంలోనే ఏమీ చేయని ఉన్నతాధికారులు.. ఇతర విభాగాల్లోనూ వక్రమార్గాల్లో అక్రమాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. (చదవండి: చితి మంటలకు చెల్లు! విదేశాల్లో ఉన్నవారు సైతం చూసేలా...) -
సరోగసి తల్లికీ మాతృత్వపు సెలవు
సాక్షి, అమరావతి/కాకినాడ: సరోగసి(అద్దె గర్భం) ద్వారా తల్లి అయిన ఓ అసోసియేట్ ప్రొఫెసర్‌కు మాతృత్వపు సెలవు మంజూరు చేయని పలువురు అధికారుల తీరును హైకోర్టు తప్పుపట్టింది. ఆమెకు కూడా మాతృత్వపు సెలవు మంజూరు చేయాల్సిందేనని ఆదేశించింది. ఈ మాతృత్వపు సెలవు ఇదే వ్యాజ్యంలో తాము ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, వైద్య విద్య డైరెక్టర్, రంగరాయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌ను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ఇటీవల మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. కాకినాడకు చెందిన ఉండమట్ల మురళీకృష్ణ ఆడిటర్‌గా పని చేస్తుండగా, ఆమె భార్య డాక్టర్ కిరణ్మయి రంగరాయ మెడికల్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కిరణ్మయి గత నెలలో సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లి అయ్యారు. మాతృత్వపు సెలవు కోసం ఆమె దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని అధికారులు తిరస్కరించారు. దీంతో కిరణ్మయి గత నెల 24న హైకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ జయసూర్య అధికారుల తీరును ఆక్షేపించారు. విచారణను ఫిబ్రవరి 3కి వాయిదా వేశారు. -
Hamsa Nandini Nanduri: కంటేనే అమ్మ అంటే ఎలా?.. దత్తత తీసుకున్నా అమ్మే..!
Hamsa Nandini Nanduri: Adopted Children Why Discriminate Against Me: జన్మనిస్తేనే తల్లా, దత్తత తీసుకుంటే తల్లికాదా? ఎందుకీ వివక్ష? జన్మనిచ్చినా, ఇవ్వకపోయినా పిల్లల్ని దత్తత తీసుకుని, తల్లి అయిన తరువాత ఆ చిన్నారుల ఆలనాపాలన చూడడంలో ఈ ఇద్దరు తల్లులు పడే ఆరాటం ఒకటే. అటువంటప్పుడు ప్రసూతి హక్కులను ఇద్దరికీ ఎందుకు సమానంగా కేటాయించట్లేదు? అని ప్రశ్నిస్తోంది హంసనందిని నండూరి. ప్రశ్నించడం దగ్గరే ఆగిపోకుండా నాలుగడుగులు ముందుకేసి ’వివక్ష లేకుండా తల్లులందరికీ ఒకేరకమైన హక్కులు కల్పించాలని, మెటర్నిటీ చట్టంలో మార్పులు తీసుకురావాలని సుప్రీంకోర్టులో సైతం పోరాటం చేస్తోంది. బెంగళూరుకు చెందిన హంసనందిని నండూరి దంపతులకు పెళ్లై ఐదేళ్లు అయినా సంతానం కలగకపోవడంతో పిల్లల్ని దత్తత తీసుకుందామని నిర్ణయించుకున్నారు. వెంటనే పిల్లల దత్తత కోసం దరఖాస్తు చేశారు. దరఖాస్తు చేసుకున్న ఏడునెలల్లోనే వారికి కాల్ వచ్చింది. దీంతో 2016లో కారా(సెంట్రల్ అడాప్షన్ రిసోర్సెస్ అథారిటీ) పద్ధతిలో ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకున్నారు. ఐదేళ్ల పాపని, రెండేళ్ల బాబుని దత్తత తీసుకున్నారు. పన్నెండు వారాలే.. పిల్లలిద్దరూ ఈశాన్య భారతదేశానికి చెందిన వారు కావడం, హిందీ మాత్రమే తెలిసి ఉండడంతో నందిని దంపతులకు పిల్లలకు దగ్గరవడం కాస్త కష్టమైంది. దీంతో నందిని తను పనిచేసే లాఫాంలో ప్రసూతి సెలవుకోసం దరఖాస్తు చేసుకుంది. మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ –1961 ప్రకారం మూడు నెలల్లోపు పిల్లల్ని దత్తత తీసుకున్న తల్లులకు ఇచ్చే 12 వారాల ప్రసూతి సెలవును లా ఫామ్ మంజూరు చేసింది. పన్నెండు వారాల్లో ఆ పిల్లలిద్దరికి దగ్గరవడం కష్టం. బిడ్డకు జన్మనిచ్చిన అమ్మలకు ఇచ్చినట్లే.. పిల్లల్ని దత్తత తీసుకున్న తల్లులకు కూడా 26 వారాల ప్రసూతి సెలవు అవసరమని హంసనందినికి అర్థమైంది. కానీ ఆ అవకాశం లేదు. దీంతో జీతం నష్టపోయినా పర్వాలేదనుకుని మరో మూడు నెలలు సెలవు తీసుకుని పిల్లలకు దగ్గరైంది. హార్ట్మామ్స్ నీడ్ లవ్.. ‘‘ఏ తల్లికైనా అవే బాధ్యతలు ఉంటాయి. జన్మనిచ్చిన తల్లులకు, దత్తత తీసుకున్న తల్లులకు ఎందుకు ఈ వివక్ష. వారిలాగే దత్తత తీసుకున్న తల్లులకు మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్–1961 ప్రయోజనాలు చేకూరాలి. దత్తత తీసుకున్న తల్లులకు మెటర్నిటీ సెలవులు సమానం గా ఇవ్వాలి’’ అని ‘హార్ట్ మామ్స్ నీడ్ లవ్’ పేరిట ఛేంజ్ డాట్ ఓ ఆర్జీ పిటిషన్ వెబ్‌సైట్‌ను నడుపుతోంది. దీనిద్వారా పిల్లల్ని దత్తత తీసుకున్న తల్లులకు కూడా సాధారణ తల్లులకు వర్తించే ప్రసూతి హక్కులను కల్పించాలని పోరాటం చేస్తోంది. ‘‘పురిటి నొప్పులు అనుభవించనంత మాత్రాన దత్తత తల్లి తల్లి కాకుండా పోదు. నిజానికి జన్మనిచ్చిన తల్లుల కంటే దత్తత తీసుకున్న తల్లులు బిడ్డకు దగ్గరవ్వడానికి ఎక్కువ రోజులు పడుతుంది. అది నేను ప్రత్యక్షంగా అనుభవించాను. కొత్తగా వచ్చిన పిల్లలకి తల్లిదండ్రులుగా మానసికంగా, శారీరంగా వారిని దృఢపరచాలి. ఇవన్నీ చేయడానికి చాలా సహనంతో వ్యవహరించాల్సి ఉంటుంది.’’ అని చెబుతున్న నందిని ప్రస్తుతం ఓ కంపెనీ లీగల్ హెడ్‌గా పనిచేస్తోంది. సుప్రీంకోర్టు దృష్టికి ఆమె ఈ అంశాన్ని తీసుకెళ్లింది. చట్టప్రకారం.. ఇటీవల హంసనందిని పిల్‌ను విచారణకు స్వీకరించిన అత్యున్నత ధర్మాసనం.. పిల్లల్ని దత్తత తీసుకున్న తల్లులకు మెటర్నిటీ చట్టం–1961 సెక్షన్ 5(4), రాజ్యాంగం పరంగా ఎందుకు అమలు కావడం లేదు? అన్న అంశాలపై నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.ఎంతోమంది తల్లుల ఆవేదనకు అక్షర రూపమే నందిని వాదన. తనకు ఆ సౌలభ్యం లేకపోయినప్పటికీ తనలాంటి వారెందరికో ఉపయోగపడుతుందని పోరాడుతోంది. సానుకూల తీర్పువస్తే ఎంతోమంది దత్తత తల్లులకు లాభం చేకూరుతుంది. చదవండి: వెంటాడే చిత్రాలు.. -
తమిళనాడు: మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్
సాక్షి, చెన్నై: మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు తమిళనాడు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఆయా ప్రభుత్వ ఉద్యోగాలు చేసే మహిళలకు ప్రసూతి సెలవుల సంఖ్యను పెంచనున్నట్లు ప్రకటించింది. మహిళా ఉద్యోగుల ప్రసూతి సెలవులను ఏడాడి కాలం పాటు పొడగిస్తున్నట్లు ఆర్థికమంత్రి పళనివేల్ త్యాగరాజన్ శుక్రవారం జరిగిన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో పేర్కొన్నారు. ఇక, ప్రస్తుతం రాష్ట్రంలో మహిళా ప్రభుత్వం ఉద్యోగలు 9 నెలల ప్రసూతి సెలవులు పొందుతున్న విషయం తెలిసిందే. తాజా నిర్ణయంతో మహిళా ఉద్యోగులు ఏడాది పాటు ప్రసూతి సెలువులు పొందనున్నారు. డీఎంకే పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో హామీల్లో ప్రసూతి సెలవుల పెంపు ఒకటని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న ప్రసూతి సెలవుల పెంపుతో.. తల్లుల ఆర్యోగం మెరుగుపడుతుందని, మొదటి ఆరు నెలల పాటు శిశువులకు తల్లి పాలు సమృద్ధిగా అందుతాయని సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు అభిప్రాయపడ్డారు. అదేవిధంగా తమిళనాడు ప్రభుత్వం మాతా, శిశువులకు ఉచిత వ్యాక్సినేషన్, పోషకాహారం అందిస్తోంది. కానీ, చాలా మంది తల్లులకు సరైన సమయం లభించకపోవటంతో వారి ఆరోగ్యం, శిశువుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపలేకపోతున్నారని అధికారులు తెలిపారు. పొడగించిన ప్రసూతి సెలవులతో మాతా, శిశువుల ఆరోగ్యం విషయంలో మంచి ఫలితాలుంటాయని పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సీఎం ఎం.కే స్టాలిన్.. తమ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని తెలిపారు. -
పిల్లలను దత్తత తీసుకున్నా మెటర్నిటీ లీవ్
సాక్షి బెంగళూరు: ప్రసవ సమయంలో మహిళా ఉద్యోగులకు ఇచ్చే మెటర్నిటీ సెలవును ఇకపై పిల్లలను దత్తత తీసుకున్నావారికీ ఇవ్వనున్నారు. పిల్లలను దత్తత తీసుకున్న మహిళా ఉద్యోగికి 180 రోజులు, పురుష ఉద్యోగికి 15 రోజులు సెలవు లభించనుంది. చిన్నారిని దత్తత తీసుకున్న రోజునుంచే సెలవు అన్వయమవుతుంది. ప్రభుత్వ నియమాలప్రకారం ఇద్దరు పిల్లల దత్తతవరకే ఆ సెలవుకు అవకాశంఉంటుంది. -
అంగన్వాడీ టీచర్ల జీతం 50 శాతం పెంపు
-
బడ్జెట్ 2019 : అంగన్వాడీల వేతనాలు పెంపు
న్యూఢిల్లీ : బడ్జెట్లో మోదీ ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేసిందని పీయూష్ గోయల్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని 8 కోట్ల మందికి ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వాడానికి రూపొందించిన ‘ప్రధాన్ మంత్రి ఉజ్వాలా యోజన ’పథకంలో భాగంగా ఇప్పటికే 6 కోట్ల మందికి ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చినట్లు తెలిపారు. అంతేకాక అంగన్వాడీ సిబ్బంది వేతానాన్ని 50 శాతం పెంచుతున్నట్లు ప్రకటించారు. అంతేకాక ‘ప్రధాన్ మంత్రి ముద్రా యోజన’ పథకంలో 75 శాతం మంది మహిళా లబ్ధిదారులున్నట్లు తెలిపారు. ‘మాతృత్వ యోజన’ పథకం ద్వారా మహిళా ఉద్యోగులకు 26 వారాల సెలవు దినాలు ఇస్తున్నట్లు తెలిపారు. -
ప్రసూతి చట్టంతో 18 లక్షల ఉద్యోగాలకు ఎసరు
కొండనాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందని సామెత కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రసూతి చట్టం ఈ సామెతకి మరోపేరులా మారిపోనుందా ? గర్భిణుల కెరీర్‌కు ఆటంకాలు ఉండకూడదన్న సదుద్దేశంతో ప్రసూతి చట్టానికి చేసిన సవరణలు వారి ఉద్యోగాలకే ఎసరు పెడుతున్నాయా ? అవుననే అంటోంది టీమ్‌లీజ్ సర్వీసెస్ లిమిటెడ్. ఈ సంస్థ తాజాగా చేసిన సర్వేలో ప్రసూతి చట్టం వ్యతిరేక ఫలితాల్నే తీసుకువస్తోందని వెల్లడైంది. తల్లీ బిడ్డల ఆరోగ్యం కోసం, పిల్లలు పుట్టినా మహిళలు ఉద్యోగాల్లో కొనసాగేలా ఉండాలన్న ఉద్దేశంతో ప్రసూతి సెలవును 12 వారాల నుంచి 26 వారాల వరకు పెంచుతూ గత ఏడాది ప్రసూతి చట్టానికి చేసిన సవరణలు మహిళలకు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నాయి. ఈ చట్టం కారణంగా 2018–19 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 10 సెక్టార్లలో 11 నుంచి 18 లక్షల మంది మహిళలు ఉద్యోగాలు కోల్పోతారని టీమ్‌లీజ్ సర్వీసెస్ లిమిటెడ్ తాజా సర్వేలో వెల్లడైంది. అదే అన్ని రంగాల్లోనూ ఇదే స్థాయిలో చట్టం ప్రభావం ఉంటే కోటి నుంచి 1.2 కోట్ల మంది మహిళలు ఉద్యోగాలు కోల్పోతారని ఆ సర్వే అంచనా వేసింది. ఏయే రంగాల్లో సర్వే విమానయాన రంగం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ ఆధారిత సర్వీసులు, రియల్ ఎస్టేట్, విద్య, ఈ కామర్స్, తయారీ రంగం, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, రిటైల్, పర్యాటకం వంటి రంగాలకు సంబంధించిన 300 కంపెనీల యాజమాన్యాల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ రంగాలకి సంబంధించి అతి పెద్ద కంపెనీలు, ఆర్థిక పరిపుష్టి కలిగినవి ప్రసూతి చట్టాన్ని స్వాగతిస్తే, చిన్న మధ్యతరహా కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఎందుకీ ప్రతికూల ప్రభావం ప్రసూతి సెలవు తర్వాత కూడా మహిళా ఉద్యోగుల్ని కొనసాగించాలంటే సాధారణ కంపెనీలకు ఉద్యోగుల వార్షిక వేతనంలో 80 నుంచి 90 శాతం ఖర్చు అయితే, ఇక శ్రామిక రంగానికి సంబంధించిన ఉద్యోగుల వార్షిక వేతనంలో 135 శాతం ఖర్చు అవుతుంది. అంత ఖర్చుని భరించడానికి చాలా కంపెనీ యాజమాన్యాలు విముఖత ప్రదర్శిస్తున్నాయి. వేతనంతో కూడిన సెలవును మంజూరు చేయడానికి ముందుకు రావడం లేదు. ఈ చట్టం ప్రకారం 50మందికి పైగా ఉద్యోగులు ఉన్న ప్రతీ కంపెనీ ఆఫీసుల్లో క్రష్ ఏర్పాటుచేయాలి. అందుకే చిన్న కంపెనీలు, స్టార్టప్ కంపెనీలు మహిళలకి ఉద్యోగాలు ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. మరి కొన్ని కంపెనీలు వేరే సాకులతో మహిళల్ని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి. విదేశాల్లో ఏం చేస్తారు ? అభివృద్ధి చెందిన దేశాల్లో మహిళలకు ప్రసూతి సెలవులకయ్యే ఖర్చుని ఆమె పనిచేసే సంస్థలు భరించవు. సదరు కంపెనీలపై పడే ఆర్థిక భారాన్ని ఎంతో కొంత ప్రభుత్వాలే భరిస్తాయి. పన్నుల్లో మినహాయింపులు కూడా ఇస్తాయి. యూకే వంటిదేశాల్లో మహిళలు 52 వారాల వరకు ప్రసూతి సెలవును తీసుకునే సదుపాయం ఉంది. అక్కడ కంపెనీలు ఆదాయం 45 వేల పౌండ్ల కంటే తక్కువ ఉంటే ప్రభుత్వమే మొత్తం భరిస్తుంది. ఇక పెద్ద కంపెనీలకైతే 92 శాతం ప్రభుత్వమే తిరిగి చెల్లిస్తుంది. కానీ భారత్‌లో అలా జరగడం లేదు. ఇలాంటి సంస్కరణలు తీసుకువచ్చినప్పుడు చిన్న, మధ్య తరగతి కంపెనీల భారాన్ని ప్రభుత్వమే భరిస్తే మహిళల ఉద్యోగాలకు భద్రత ఉంటుందని ఒక అంతర్జాతీయ సంస్థకు చెందిన ఎండీ కె. సుదర్శన్ అభిప్రాయపడ్డారు. సాధారణంగా చిన్న, మధ్య తరగతి కంపెనీలు తక్కువ మంది ఉద్యోగులతోనే నడుపుతాయి. ఒకేసారి అయిదుగురు మహిళల్లో ఇద్దరు ప్రసూతి సెలవు తీసుకుంటే ఆ కంపెనీయే కుప్పకూలిపోయే పరిస్థితి వస్తుందని ఆయన అన్నారు. -సాక్షి నాలెజ్డ్ సెంటర్ -
ప్రసూతి సెలవులకూ దిక్కులేదు
హామీలను నెరవే ర్చాలంటూ వీఆర్ఏల ఆందోళన సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో ఒకేసారి నియమితులైనప్పటికీ ఏపీ ప్రభుత్వం రెండు నెలల ప్రసూతి సెలవు మంజూరు చేసిందని, ఏడాదిన్నరగా విన్నవిస్తున్నా తెలంగాణలో ఈ అవకాశం కల్పించలేదని మహిళా వీఆర్ఏలు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ డెరైక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్ఏల అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం అన్ని జిల్లాల నుంచి వచ్చిన వీఆర్ఏలు సీసీఎల్ఏ కార్యాలయంలో ఆందోళన చేపట్టారు. తమ డిమాండ్లను నెరవేర్చుతానని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ హామీ ఇచ్చినప్పటికీ... సంబంధిత ఫైళ్లు ఏడాదిన్నరగా సీసీఎల్ఏ కార్యాలయం గడప దాటడం లేదన్నారు. ప్రసూతి సెలవుతో పాటు ప్రత్యేక పేస్కేల్, పదోన్నతుల్లో వాటా పెంపు తదితర డిమాండ్లను పరిష్కరించేందుకు మంత్రులు, ఉన్నతాధికారులు సానుకూలంగా ఉన్నప్పటికీ సదరు ఫైళ్లను ముందుకు పోనీయకుండా సెక్షన్ సిబ్బంది మోకాలడ్డుతున్నారని వీఆర్ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్బహద్దూర్ ఆరోపించారు. తక్షణం వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.