హామీలను నెరవే ర్చాలంటూ వీఆర్‌ఏల ఆందోళన
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో ఒకేసారి నియమితులైనప్పటికీ ఏపీ ప్రభుత్వం రెండు నెలల ప్రసూతి సెలవు మంజూరు చేసిందని, ఏడాదిన్నరగా విన్నవిస్తున్నా తెలంగాణలో ఈ అవకాశం కల్పించలేదని మహిళా వీఆర్‌ఏలు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ డెరైక్ట్ రిక్రూట్‌మెంట్ వీఆర్‌ఏల అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం అన్ని జిల్లాల నుంచి వచ్చిన వీఆర్‌ఏలు సీసీఎల్‌ఏ కార్యాలయంలో ఆందోళన చేపట్టారు. తమ డిమాండ్లను నెరవేర్చుతానని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ హామీ ఇచ్చినప్పటికీ... సంబంధిత ఫైళ్లు ఏడాదిన్నరగా సీసీఎల్‌ఏ కార్యాలయం గడప దాటడం లేదన్నారు.
ప్రసూతి సెలవుతో పాటు ప్రత్యేక పేస్కేల్, పదోన్నతుల్లో వాటా పెంపు తదితర డిమాండ్లను పరిష్కరించేందుకు మంత్రులు, ఉన్నతాధికారులు సానుకూలంగా ఉన్నప్పటికీ సదరు ఫైళ్లను ముందుకు పోనీయకుండా సెక్షన్ సిబ్బంది మోకాలడ్డుతున్నారని వీఆర్‌ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్‌బహద్దూర్ ఆరోపించారు. తక్షణం వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రసూతి సెలవులకూ దిక్కులేదు
Published Wed, Jul 13 2016 3:35 AM | Last Updated on Sat, Aug 18 2018 8:08 PM
Advertisement