కేంద్ర ఉద్యోగుల డిప్యుటేషన్‌ భత్యం రెట్టింపు | Central Government employees to get double deputation allowance soon | Sakshi
Sakshi News home page

కేంద్ర ఉద్యోగుల డిప్యుటేషన్‌ భత్యం రెట్టింపు

Published Tue, Nov 28 2017 5:11 AM | Last Updated on Tue, Nov 28 2017 5:11 AM

Central Government employees to get double deputation allowance soon - Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుతం డిప్యుటేషన్‌పై వెళ్లే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న భత్యాన్ని రూ.2 వేల నుంచి రూ.4,500కు పెంచుతున్నట్లు కేంద్ర సిబ్బంది శిక్షణా సంస్థ(డీవోపీటీ) తెలిపింది. ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు ఈ పెంపు చేపట్టినట్లు పేర్కొంది. ప్రస్తుతం పనిచేస్తున్న ప్రాంతంలోనే డిప్యుటేషన్‌పై వెళ్లే కేంద్ర ఉద్యోగులకు వారి మూలవేతనంలో 5% లేదా గరిష్టంగా నెలకు రూ.4,500 చెల్లిస్తామని తెలిపింది. ఒకవేళ ఉద్యోగులు మరో ప్రాంతానికి డిప్యుటేషన్‌పై వెళితే..వారి మూలవేతనంలో 10% లేదా గరిష్టంగా రూ.9 వేలు చెల్లిస్తామంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement