హైదరాబాద్: కంటోన్మెంట్‌లోని శ్రీరామ్ కేటరర్స్‌కు అరుదైన అవకాశం దక్కింది. ఈ నెల 22న అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా లడ్డూ తయారు చేసే భాగ్యం కల్పించారు. ఈ మేరకు లడ్డూ తయారీకి అనుమతులిస్తూ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర.. శ్రీరామ్ కేటరింగ్‌కు లేఖ పంపింది. ఇంతటి అదృష్టం దక్కడం తన పూర్వజన్మ సుకృతమని నిర్వాహకులు నాగభూషణం రెడ్డి తెలిపారు.
1,265 కిలోల లడ్డూ..
ఈ నెల 22న అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం కోసం తాము 1,265 కిలోల లడ్డూ తయారీ చేయనున్నట్లు శ్రీరామ్ కేటరింగ్ ఎండీ నాగభూషణం రెడ్డి తెలిపారు. సంక్రాంతి రోజున లడ్డూ తయారీ మొదలుపెట్టి 17వ తేదీ కి పూర్తి చేస్తామన్నారు. అదే రోజు ప్రత్యేక పూజల అనంతరం రోడ్డు మార్గాన అయోధ్యకు తీసుకెళ్లనున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment