మద్యం మత్తులో వ్యక్తి ఆత్మహత్య
బంజారాహిల్స్: మద్యానికి బానిసైన ఓ వ్యక్తి మత్తులో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..బంజారాహిల్స్ రోడ్ నెంబర్–2లోని ఇందిరానగర్‌లో నివసించే ధర్మా (35) సినిమా షూటింగ్‌లలో ఆర్ట్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఏడేళ్ల క్రితం భార్యతో గొడవ పడి ఇందిరానగర్‌కు వచ్చి అద్దెకు ఉంటున్నాడు. సినిమా షూటింగ్‌లలో పనిచేస్తున్న ఓ మహిళ (37)తో ఏర్పడిన పరిచయం సహజీవనానికి దారితీసింది. గత కొన్నేళ్లుగా వీరిద్దరు ఇందిరానగర్ అమృతాబార్ గల్లీలో అద్దెకు ఉంటున్నారు. కొంతకాలంగా ధర్మా మద్యానికి బానిసయ్యాడు. నూతన సంవత్సరం సందర్భంగా ఈ నెల ఒకటో తేదీన ఉదయం నుంచి తాగుతూనే ఉన్నాడు. రాత్రి 10 గంటలకు ఆయనతో సహజీవనం చేస్తున్న మహిళ తాగడం ఆపండి..తినండి..అంటూ హితవు పలికింది. అంతకుముందు నుంచే బావమరిది దుర్గతో మద్యం తాగుతుండగా ఇద్దరి మధ్యా తీవ్ర ఘర్షణ జరిగింది. దుర్గను తీవ్రంగా కొట్టాడు. దీంతో దుర్గ అలిగి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి మళ్లీ మద్యం తాగుతుండగా ఆమె వారించింది. దీంతో ఆమెను కూడా తీవ్రంగా కొట్టాడు. ఇంట్లో నుంచి బయటకు గెంటివేసి లోపలి నుంచి గడియ పెట్టుకున్నాడు. అర్ధరాత్రి దాటినా తలుపు తీయకపోవడంతో ఆమె కిటికీలో నుంచి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటనా స్థలానికి క్లూస్ టీమ్ చేరుకుని ఆధారాలు సేకరించారు. ఈ ఘటనపై ఇంటి యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment