సీనియర్ పీసీ సర్కార్ అన్నట్లు ‘నేను నిద్రించినప్పుడు ఇంద్రజాలాన్ని శ్వాసగా తీసుకుంటారు. లేచింది మొదలు ఇంద్రజాలంతోనే పనిచేస్తాను’ అన్నారు. అలాగే పీసీ సర్కార్ కుటుంబం ఇంద్రజాలానికి పెనువేసుకుని పోయిన మూడు తరాల బంధం ఇది. 111 సంవత్సరాల క్రింతం 1913లో ప్రతుల్ చంద్ర ప్రకాష్ (సీనియర్ పీసీ సర్కార్ చంద్ర) కోల్‌కతాలో జన్మించిన ఆయన అక్కడే ఇంద్రజాల ప్రదర్శనలు ప్రారంభించి అద్భుతమైన కళను ఖండాంతరాలను దాటించి కీర్తి ప్రతిష్టలను పొందాడు.
వంశపారంపర్యంగా..
ప్రతుల్ సర్కార్ తదనంతరం ఆయన కుమారుడు ప్రొవాస్ చంద్ర సర్కార్ (జూనియర్ పీసీ సర్కార్) సైతం తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ దేశ విదేశాల్లో ప్రదర్శనలిస్తూ.. అందరి మన్ననలూ పొందారు. ఇక మూడో తరానికి చెందిన పౌరుష్ (మాస్టర్ పీసీ సర్కార్ ) 1998లో జపాన్‌లో మొదటి ప్రదర్శణ ఇచ్చి కెరీర్ ప్రారంభించాడు. అనంతరం దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ప్రదర్శనలిస్తూ తాత, తండ్రికి తగ్గ వారసునిగా కీర్తి గడిస్తున్నాడు. ప్రస్తుతం నగరంలో ఏడేళ్ల తర్వాత తన మంత్ర దండంతో మాయ చేయనున్నారు. ఈయన 12 ఏళ్ల కుమారుడు పౌరివ్ చంద్ర సర్కార్ ఇదే వేదికపై మొదటి ప్రదర్శన ఇవ్వనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment