అంబేడ్కర్ వర్సిటీ కేలండర్, డైరీ ఆవిష్కరణ
బంజారాహిల్స్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ నూతన సంవత్సర డైరీ, కేలండర్‌లను గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, వీసీ ఆచార్య ఘంటా చక్రపాణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ యూనివర్సిటీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై వారు చర్చించారు.
ఈదులకుంట ఎక్కడ?
ఖానామెట్‌లో హైడ్రా సర్వే
సాక్షి, సిటీబ్యూరో: శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌లోని ఈదులకుంట ఆనవాళ్లు గుర్తించడంపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా గురువారం ఆ ప్రాంతానికి వెళ్లిన అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయి సర్వే నిర్వహించారు. సర్వే ఆఫ్ ఇండియా సిబ్బంది సైతం దీనికి సహకరిస్తున్నారు. ఖానామెట్–కూకట్‌పల్లి సరిహద్దులో ఉండాల్సిన ఈ చెరువు మాయమైందంటూ స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీనికి ముందే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ) నుంచి సేకరించిన హై రిజల్యూషన్ మ్యాప్స్ ఆధారంగా చెరువు ఆనవాళ్లను హైడ్రా గుర్తించింది. నెల రోజుల క్రితం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్షేత్ర స్థాయిలోనూ పర్యటించి ఆక్రమణల తీరును పరిశీలించారు. ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఆ స్థలం తమదంటూ చెబుతున్న వారితో పాటు ఫిర్యాదు చేసిన స్థానికులను హైడ్రా కార్యాలయానికి పిలిపించిన ఉన్నతాధికారులు పూర్వాపరాలు వివరించారు. ఈదులకుంట కబ్జాపై తీసుకోవాల్సిన చర్యలు సంబంధించి త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment