‘ఇస్తేమా’కు సర్వం సిద్ధం
సాక్షి,సిటీబ్యూరో: నగర శివారు శంకర్‌పల్లిలో శుక్రవారం నుంచి మూడు రోజులపాటు తబ్లీకి జమాత్ ఇస్తేమా జరగనుంది. ఈ సమ్మేళనానికి లక్షల సంఖ్యలో ముస్లింలు హాజరుకానున్నారు. ఈ మేరకు 200 ఎకరాల విస్తీర్ణంలో సదస్సు నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో హాజరు కానుండడంతో ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. విద్యుత్, తాగునీరు, మరుగుదొడ్లు, రవాణా సౌకర్యాలు కల్పిస్తోంది. ఇస్తేమాలో మతగురువులు ఇస్లాం ధర్మం ముఖ్య అంశాల గురించి ఉపదేశాలు చేయనున్నారు. మౌలానా అస్లం నాగ్‌పూరీ, మౌలానా ఖాసీం ఖురేషీ, మౌలానా షౌకత్ షితాపూరీ, మౌలానా మహ్మద్ ముస్తాఖ్ ఖాస్మీతోపాటు పలువురు మత ప్రముఖులు వివిధ అంశాలపై ధార్మిక ఉపదేశాలు ఇవ్వనున్నారు. ఆయా జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చే వారికోసం ఎక్కడివారు అక్కడే వంట చేసుకోవడానికి, విశ్రమించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సమ్మేళనానికి లక్షల సంఖ్యలో ముస్లింలు వస్తున్నందున పోలీసుశాఖ భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టింది.
ఇస్తేమా జరిగే ప్రదేశాన్ని పరిశీలిస్తున్న డీఎంహెచ్‌ఎ వెంకటేశ్వరావు
శంకర్‌పల్లిలో నేటి నుంచి మూడురోజుల పాటు కార్యక్రమం
ధార్మిక ఉపదేశాలు ఇవ్వనున్న మత గురువులు
Comments
Please login to add a commentAdd a comment