కేలండర్ ఆవిష్కరణ
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ హైదరాబాద్ జిల్లా నూతన సంవత్సరం కేలండర్‌ను హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీఎన్జీఓస్ అసోసియేషన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు కేబీ కృష్ణ యాదవ్, ఉపాధ్యక్షులు డాక్టర్ సురేందర్, రాజేందర్, ఆర్. కోటజి, శ్రీరామ్, సునీత జోషి, నర్సింగ రావు, బి. కుమార్, శ్రవణ్ కుమార్ రెడ్డి, ఎమ్.డి గౌస్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
పీఆర్‌టీయూ హైదరాబాద్ జిల్లా విభాగం రూపొందించిన టేబుల్, వాల్ కేలండర్ – 2025 గురువారం పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి ఆవిష్కరించారు. పీఆర్‌టీయూ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుల్గం దామోదర్ రెడ్డి, మాజీ శాసనమండలి సభ్యులు మోహన్ రెడ్డి, కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment