గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్‌కు పటిష్ట బందోబస్తు
గచ్చిబౌలి: హీరో రాంచరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కు గచ్చిబౌలి పటిష్ట చర్యలు చేపట్టారు. సినీహీరో రాంచరణ్‌ను అభిమానుల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కొత్తగూడలోని శరత్‌సిటీ క్యాపిటల్ మాల్‌లో ఏఎంబీ (ఏషియన్ మహేష్ బాబు) సినిమాస్‌లో దాదాపు 2 గంటల పాటు బందోబస్తు నిర్వహించారు. గురువారం సాయంత్రం ఏఎంబీ మాల్‌లోని స్క్రీన్ నెంబర్ 1లో గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. బి–1 నుంచి నేరుగా లిఫ్ట్‌లో 5వ ఫ్లోర్‌కు టికెట్ ఉన్న వారిని పంపించారు. అనంతరం రాంచరణ్‌తో పాటు నటుడు శ్రీకాంత్, దర్శకులు శంకర్, రాజమౌళి, ప్రొడ్యూసర్లు దిల్ రాజు, శశి తదితరులను లిఫ్ట్‌లో స్క్రీన్1లోకి పంపించారు.
సాయంత్రం రాంచరణ్, దర్శకులు, ప్రొడ్యూసర్లు 4వ ఫ్లోర్ నుంచి లిఫ్ట్ ద్వారా బి–1 పార్కింగ్‌లోకి పంపించారు. అక్కడి నుంచి కారులో బయటకు పంపారు. లాంజ్‌లో లిఫ్ట్ వద్ద ఫ్లోర్‌లో అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అభిమానులు రాం అని పిలువగానే లిఫ్ట్ ఎక్కేందుకు వెళ్లిన రాంచరణ్ వెనక్కి వచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు వారించి నేరుగా లిఫ్ట్ నుంచి పార్కింగ్ పార్కింగ్‌కు వెళ్లాలని సూచించగా వెళ్లిపోయారు. పార్కింగ్‌లోను అభిమానులు రాంచరణ్‌ను చూసేందుకు వేచి ఉన్నారు. వారిని కలువకుండా పోలీసులు చర్యలు తీసుకోవడంతో ట్రైలర్ రిలీజ్ ప్రశాంతంగా ముగిసినట్లయ్యింది. ఇన్‌స్పెక్టర్ హబీబుల్లాఖాన్, ఎస్‌ఐలు రాజశేఖర్‌రెడ్డి, శిశిపాల్‌రెడ్డి, సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment