వెంటనే పోస్టింగ్‌లు ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

వెంటనే పోస్టింగ్‌లు ఇవ్వాలి

Published Fri, Jan 3 2025 7:59 AM | Last Updated on Fri, Jan 3 2025 7:59 AM

వెంటనే పోస్టింగ్‌లు ఇవ్వాలి

వెంటనే పోస్టింగ్‌లు ఇవ్వాలి

పంజగుట్ట: తెలంగాణ జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ పోస్టులకు అర్హత సాధించి పోస్టింగ్‌ కోసం 100 రోజులుగా ఎదురుచూస్తున్నామని.. వెంటనే తమను ఉద్యోగంలో చేర్చుకోవాలంటూ అభ్యర్థులు గురువారం విద్యుత్‌ ప్రధానకార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని వారు ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా అభ్యర్థులు ప్రశాంత్‌, శేఖర్‌, రాంనాయక్‌, రవితేజలు మాట్లాడుతూ .. సర్టిఫికెట్ల పరిశీలన పేరుతో తమ సర్టిఫికెట్లు అన్ని చూసి ఒరిజినల్‌ సర్టిఫికెట్లు వారివద్దే ఉంచుకున్నారన్నారు. 7 రోజుల్లో పోస్టింగ్‌ ఇస్తామని చెప్పి గతంలో తాము పనిచేస్తున్న కంపెనీలో కూడా రిజైన్‌ చేయించుకున్నారన్నారు. అయితే 100 రోజులవుతున్నా ఇప్పటివరకు పోస్టింగ్‌ లేదని ఆవేదనవ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement