అయోధ్యలో నేడు శ్రీరాముడి విగ్రహావిష్కరణ | Yogi Adityanath Will Visit Ayodhya Today To Unveil Statue Of Lord Ram | Sakshi
Sakshi News home page

అయోధ్యలో నేడు శ్రీరాముడి విగ్రహావిష్కరణ

Published Fri, Jun 7 2019 8:16 AM | Last Updated on Fri, Jun 7 2019 8:16 AM

Yogi Adityanath Will Visit Ayodhya Today To Unveil Statue Of Lord Ram - Sakshi

లక్నో : అయోధ్యలో ఏడు అడుగుల శ్రీరాముడి విగ్రహాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ శుక్రవారం ఆవిష్కరించనున్నారు. అయోధ్యలోని శోధ్‌ సంస్ధాన్‌ మ్యూజియంలో రోజ్‌వుడ్‌తో ఈ విగ్రహాన్ని నిర్మించారు. కర్ణాటక నుంచి రూ 35 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన ఈ విగ్రహాన్ని మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచుతారు. రాముడి ఐదు అవతారాల్లో ఒకటైన కోదండరాముని అవతారంలో ఈ విగ్రహం రూపొందింది.

మ్యూజియంలో రాముడి గురించిన పలు చారిత్రక ఘట్టాలతో 2500కు పైగా చిత్రాలు, కళారూపాలు ఉన్నా కోదండరాముని గురించి వర్ణించే ఆనవాళ్లు లేవు. కోదం‍డరామ విగ్రహాన్ని కర్ణాటక స్టేట్‌ ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్‌ ఎంపోరియం నుంచి కొనుగోలు చేశారు. ఇక యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ అయోధ్యలో శుక్రవారం మధ్యహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement