న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిరం–బాబ్రీ మసీదు భూవివాదానికి సంబంధించిన కేసు వాదనలను శుక్రవారం విననున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. ఐదుగురు జడ్జీల ధర్మాసనం ఈ కేసుకు సంబంధించిన వాదనలు విననుంది. సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ గొగోయ్, జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, డీవై చంద్రచూడ్, అశోక్ భూషణ్, ఎస్ అబ్దుల్ నాజీర్‌లు బెంచ్‌లో సభ్యులుగా ఉండనున్నారని పేర్కొంది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో దశాబ్దాలుగా నలుగుతున్న రామ జన్మభూమి–బాబ్రీ మసీదు వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించేందుకు గానూ ఈ కేసులో మధ్యవర్తిత్వానికి అనుమతినిస్తూ గతంలో సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment