భోపాల్: ఇద్దరు మైనర్లను ట్రక్కుకు కట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది. దొంగతనం చేశారనే ఆరోపణలతో తీవ్రంగా చితకబాది.. రెండు కాళ్లకు తాళ్లు కట్టి రద్దీగా ఉండే ఛాయ్‌త్రోమ్ కూరగాయల మార్కెట్ గుండా ఈడ్చుకెళ్లారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇద్దరు మైనర్లపై పోలీసులు దొంగతనం కేసు నమోదు చేశారు. మరోవైపు.. ఇద్దరిని ట్రక్కుకు కట్టి ఈడ్చకెళ్లిన ఘటనపై వీడియో ఆధారంగా కేసు నమోదు చేయనున్నట్లు చెప్పారు.
ఇదీ జరిగింది..
కూరగాయల మార్కెట్‌లో లోడ్ దింపుతుండగా ఇద్దరు టీనేజర్లు ట్రక్కు నుంచి డబ్బులు దొంగతనం చేశారని ఇద్దరు వ్యాపారులు, డ్రైవర్ ఆరోపించారు. వారు ట్రక్కులోంచి నగదు తీస్తుండగా తాను చూసినట్లు డ్రైవర్ చెప్పాడు. ఈ క్రమంలో వ్యాపారులు, అక్కడే ఉన్న కొందర మైనర్లను చితకబాదారు. వారి కాళ్లకు తాడు కట్టి ట్రక్కుకు కట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. ఇలా కూరగాయల మార్కెట్ మొత్తం తిప్పారు. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి.
ఇద్దరు మైనర్లను అదపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ‘మైనర్ల పట్ల ప్రవర్తించిన తీరు భయానకం, హింసాత్మకం. వారిపైనా మేము చర్యలు తీసుకుంటాం. వీడియో ఆధారంగా వారిని గుర్తిస్తున్నాం.’ అని ఇండోర్ పోలీసు అధికారి నిహత్ ఉపాధ్యాయ్ తెలిపారు.
ఇదీ చదవండి: జర్నలిస్టులకు లక్షల్లో ‘క్యాష్ గిఫ్ట్‌లు’.. మరో వివాదంలో కర్ణాటక ప్రభుత్వం
Comments
Please login to add a commentAdd a comment