టీనేజిలో పొగతాగితే...
టీనేజిలో పొగతాగడం అలవాటయితే మానడం బహుకష్టం అంటున్నారు ది యూనివర్శిటీ ఆఫ్ క్యాలిఫోర్నియా పరిశోధకులు. యువతలో ఎక్కువమంది పద్ధెనిమిది ఏళ్ళ వయసుకన్నా ముందే పొగతాగడం మొదలుపెడుతున్నారట.
అధ్యయనకారులు తమ పరిశోధనలో భాగంగా 16 నుంచి 21 సంవత్సరాల వయసు మధ్య ఉన్న 42 మంది అమ్మాయిలు, అబ్బాయిల బ్రెయిన్ స్కాన్ చేశారు. ఇందులో కొందరు ఎప్పుడూ పొగతాగలేదు. కొందరు మాత్రం రోజుకు ఆరు నుంచి ఏడు సిగరెట్లు తాగుతారు. పొగతాగని వారితో పోల్చితే పొగతాగే వారి మెదడులో ముఖ్యమైన మార్పులు కనిపించాయి.
మొత్తం మీద టీనేజిలో పొగతాగడం వల్ల మెదడు ఎదుగుదల మీద ప్రతికూల ప్రభావం ఉంటుందని చెబుతున్నారు పరిశోధకులు.