
అందరివాడు చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ భామ టబు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన మెప్పించింది. తెలుగులో అంతకుముందే విక్టరీ వెంకటేశ్, నాగార్జున సరసన నటించింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉన్న ముద్దుగమ్మ ఇటీవల క్రూ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. మూడు దశాబ్దాలకు పైగా తనదైన నటనతో మెప్పిస్తోంది. ప్రస్తుతం అజయ్ దేవగన్‌తో కలిసి ఔరోన్ మే కహన్ దమ్ థాలో కనిపించనుంది. ఈ మూవీ ఆగస్ట్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి నీరజ్ పాండే దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సందర్భంగా తాజాగా టబు ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సినిమాలో వీఎఫ్‌ఎక్స్ ద్వారా మరింత యవ్వనంగా కనిపించనున్నారా? అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి టబు స్పందిస్తూ.. తెరపై టీనేజ్ అమ్మాయిలా నటించాలని తనకు లేదని అన్నారు. తాను ప్రస్తుతం ఎలా ఉన్నానో.. అలాగే కనిపిస్తానని వెల్లడించింది. దర్శకుడు నీరజ్ పాండే కూడా తన వయస్సును తగ్గించి చూపే సాహసం చేయలేదని తెలిపింది.
గతంలో నటీనటులు వయస్సుకి తగిన పాత్రలే చేసేవారని.. ఇటీవలి కాలంలో పాతనటులు సైతం యంగ్ పాత్రల్లో నటిస్తున్నారని టబు వివరించింది. కానీ ఈ సినిమాలో నాకు 30 ఏళ్ల అమ్మాయిలా చేయడం ఇష్టం లేదని తెలిపింది. ఈ చిత్రంలో నా వయస్సును దాచే ప్రయత్నం చేయలేదని పేర్కొంది. కాగా.. ఔరాన్ మే కహన్ దమ్ థా మూవీని రొమాంటిక్ స్టోరీగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో అజయ్ దేవగణ్ సరసన కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 2న విడుదల చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment