
ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, నల్గొండ: ఊట్కూర్ మండలంలోని ఓ గ్రామంలో 15 ఏళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గర్భవతిని చేయగా బాధిత కుటుంబం శుక్రవారం పోలీసులను ఆశ్రయించింది. వారి కథనం మేరకు.. తమ కుమార్తె పొలం పనులకు వెళ్లేది. ఇదే క్రమంలో గ్రామానికి చెందిన నర్సింహులు అనే వ్యక్తి మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు.
రెండురోజుల క్రితం బాలిక అస్వస్థతకు గురికాగా కుటుంబ సభ్యులు వైద్యుడికి చూపించగా గర్భవతి అని నిర్ధారణ అయింది. కుటుంబ సభ్యులు కులపెద్దల సమక్షంలో బాలికను పెళ్లి చేసుకోమని కోరగా తిరస్కరించడంతో పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ వివరించారు.
చదవండి: (భర్త వివాహేతర సంబంధం.. మహిళా డాక్టర్ ఏం చేసిందంటే..?)
Comments
Please login to add a commentAdd a comment