
కోలీవుడ్ నటుడు విజయ్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. దీనికి కారణం ఆయన తన ప్రజా సంఘం ద్వారా తలపెడుతున్న కార్యక్రమాలు, తీసుకుంటున్న చర్యలే. విజయ్ తన సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి మరింతగా చొచ్చుకు పోతున్నారు అనే చెప్పాలి. నటుడుగా అశేష ప్రజాదరణ పొందుతున్న విజయ్ దాన్ని రాజకీయంగా వాడుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: 'జైలర్'కు భారీగా లాభాలు.. రజనీకి మరో చెక్ ఇచ్చిన నిర్మాత.. ఎంతో తెలుసా?)
ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేస్తున్న విజయ్ ఇటీవల సామాజిక మాధ్యమాలను వాడుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. ఇటీవలికాలంలో విజయ్ ప్రజా సంఘం కార్యదర్శి బుస్సీ ఆనంద్ నిత్యత్వంలో స్థానిక పనైయూర్ లోని విజయ్ అభిమాన సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్రంలోని 24 నియోజక వర్గాలకు చెందిన పలువురు సంఘ కార్యకర్తలు హాజరయ్యారు.
(ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవి వాచ్ ధర ఎంతో తెలుసా..?)
ఈ కార్యక్రమంలో టెక్నాలజీ వాడుకునే విధంగా 1600 వాట్సాప్ గ్రూప్‌లో ఏర్పాటు చేశారు ఈ సంఖ్యను 10 వేలకు చేర్చాలని ఆదేశించినట్లు సమాచారం. కాగా గతంలో ఎండీఎంకే నేత విజయకాంత్ కూడా ఇదేవిధంగా తన అభిమానులను ప్రజల్లోకి పంపారు. కాగా నటుడు విజయ్ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయకపోయినా కొన్నింట్లో అయినా సత్తాచాటాలని యత్నిస్తున్నట్టు విజయ్ ప్రజా సంఘం నాయకుడొకరు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment