న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఈఎస్‌జీ విభాగం కింద (పర్యావరణం, సామాజికం, పరిపాలనా అనుకూలమైన) 6 కొత్త విభాగాలను ప్రవేశపెట్టేందుకు సెబీ అనుమతించింది. ఎక్స్‌క్లూజన్స్, ఇంటెగ్రేషన్, బెస్ట్ ఇన్ క్లాస్, పాజిటివ్ స్క్రీనింగ్, ఇంపాక్ట్ ఇన్వెస్టింగ్, సస్టెయినబుల్ అబ్జెక్టివ్స్ ఈ విభాగాల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు థీమ్యాటిక్ విభాగం కింద ఒక మ్యూచువల్ ఫండ్ సంస్థ ఒక్క ఈఎస్‌జీ పథకం ఆవిష్కరణకే అనుమతి ఉండడం గమనార్హం.
ఈఎస్‌జీ కింద నూతన విభాగానికి కేటాయింపులు అనేవి తక్షణం అమల్లోకి వస్తాయని సెబీ స్పష్టం చేసింది. పర్యావరణ అనుకూలమైన ప్రాజెక్టులకు ఈ రూపంలో కావాల్సిన నిధుల మద్దతు లభిస్తుందని సెబీ తన ఆదేశాల వెను క లక్ష్యాన్ని వివరించింది. ఈఎస్‌జీ పథకాల పే రుతో సమీకరించిన ని« దులను మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఈ విభాగంలో పనిచేసే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈఎస్‌జీ పథకాల కింద సమీకరించిన మొత్తం నిధుల్లో 65 శాతాన్ని లిస్టెడ్ కంపెనీల్లోనే పెట్టాలని సెబీ నిబంధన విధించింది. మిగిలిన 35 శాతాన్ని వ్యాపార బాధ్యత, సస్టెయినబులిటీ రిపోరి్టంగ్ వివరాలను (బీఆర్‌ఎస్‌ఆర్) వెల్లడించే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయవచ్చని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment