వైరల్‌: ట్రైన్‌లో సీట్‌ దొరకలేదు.. ఏం పర్లేదు, ఇలా హాయిగా పడుకోవచ్చు | Viral Video: Man Makes His Own Jugaad Train Seat | Sakshi
Sakshi News home page

Viral Video:ట్రైన్‌లో సీట్‌ దొరకలేదు.. ‘ఓరి నీ తెలివి తగలెయ్య’ 

Published Tue, Nov 23 2021 12:55 PM | Last Updated on Tue, Nov 23 2021 7:13 PM

Viral Video: Man Makes His Own Jugaad Train Seat - Sakshi

వీకెండ్స్‌లో, పండుగ సమయాల్లో రైలు, బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. నెల రోజుల ముందు టికెన్‌ రిజర్వేషన్‌ చేసుకుంటే గానీ సీట్‌ కన్ఫర్మ్‌ అవ్వదు. ఇక అకస్మికంగా ఊరేళ్లాలనుకుంటే బస్సులో సీట్‌ దొరుకుతుందేమో కానీ రైల్లో అయితే కష్టం. జనరల్‌ టికెట్‌ తీసుకొని నిల్చొని ప్రయాణం చేయాల్సిందే. మనలో చాలామంది ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే ఉంటాం. కానీ ఇప్పుడు చెప్పబోయే ఓ వ్యక్తి మాత్రం ఇబ్బందులను దాటుకొని వినూత్న ఆలోచన చేశాడు. రైలులో తనకంటూ ప్రతేక సీట్‌ను ఏర్పాటు చేసుకొని హాయిగా పడుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని రోజుల క్రితం మీమ్స్‌ పేజ్‌ షేర్‌ చేసింది.
చదవండి: వెర్రి వేయి రకాలు.. కుక్కని బుక్‌ చేసేందుకు...మరీ అలా చేయాలా?

‘భారతీయుల తెలివితో మీరెప్పుడూ సరిపోలేరు’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. లక్షల్లో వ్యూవ్స్‌, వేలల్లో లైకులు వచ్చి చేరుతున్నాయి. దీనిలో అసలేముందంటే.. రైలులో కోచ్‌ పూర్తిగా నిండిపోవడంతో ఓ వ్యక్తికి సీట్‌ దొరకలేదు. అయితే రాత్రి పడుకోడానికి అతనికి నేల తప్ప మరెక్కడ చోటు లేకపోయింది. ఈ క్రమంలో ఆ వ్యక్తికి అద్భుతమైన ఆలోచన తట్టింది. తన దగ్గరున్న బెడ్‌షీట్‌ను తీసుకొని ఒక చివర లగేజ్‌ హోల్డర్‌కు, మరో సీటుకు కలిపి గట్టిగా కట్టాడు. దీంతో కోచ్‌ మధ్యలో ఊయల లాగా ఏర్పడింది. వెంటనే పెక్కి ఎక్కి ఆ ఊయలలో హాయిగా పడుకుంటాడు.
చదవండి: ఆ ఆహ్వానం నచ్చింది... అందుకే ఈ రాత్రికి అక్కడికి వెళ్తా!!

దీనిని చూసిన తోటి ప్రయాణికులు ఆశ్యర్యం వ్యక్తం చేస్తూ.. అతడి తెలివిని తలుచుకొని నవ్వుకుంటారు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘ఇలా అయితే ట్రైన్‌ టికెట్‌ కూడా అవసరం లేదు. ఇతనికి తెలివి బాగా ఉంది. ఇలా పడుకుంటే హాయిగా నిద్రపోవచ్చు. ఇంకోసారి ట్రైన్‌లో వెళ్లేటప్పుడు నేను కూడా ఇలాగే చేస్తాను’  అంటూ సరదాగా కామెంట్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement