
మృతి చెందిన తండ్రి చలపతి,ఉరేసుకున్న జయకుమార్
చిత్తూరు, కురబలకోట: తండ్రి మరణాన్ని ఆ కుమారుడు జీర్ణించుకోలేకపోయాడు. తన జీవితం కూడా వ్యర్థమని భావించాడు. తండ్రి మరణించిన కొద్దిసేపటికే తనువు చాలించాడు. కురబలకోట మండలంలోని శ్రీరాములవారిపల్లెలో గురువారం సాయంత్రం ఈ విషాద సంఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం శ్రీరాములవారిపల్లెకు చెందిన ఎం. చలపతి (60)కి ముగ్గురు కుమారులు. వీరంతా పెయింటర్లుగా స్థిరపడ్డారు. ఇద్దరికి వివాహమైంది. వీరు వేరే గ్రామాల్లో ఉంటున్నారు.
జయకుమార్ (28)కు పెళ్లి కాలేదు. ఇతను తండ్రి వద్దనే ఉంటున్నాడు. ఆరు నెలల క్రితం తల్లి చనిపోయింది. ఇటీవల తండ్రి కూడా కాలు దెబ్బతిని మంచానికే పరిమితమయ్యాడు. ఇంట్లో చలపతి, ఆయన తనయుడు జయకుమార్ మాత్రమే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం చలపతి అనారోగ్యంతో చనిపోయాడు. దీన్ని తట్టుకోలేక ఆయన తనయుడు మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సకాలంలో స్థానికులు గుర్తించలేకపోయారు. వారు చూసేటప్పటికే ఉరికి శవం వేలాడుతుండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. తర్వాత మిగిలిన కుటుంబ సభ్యులంతా చేరుకున్నారు. ఒకే రోజు తండ్రి, కొడుకు మృతిచెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. జయకుమార్ మృత దే హాన్ని పోస్టుమార్టం కోసం మదనపల్లె ప్ర భుత్వాస్పత్రికి తరలించినట్లు్ల ఎస్‌ఐ వెంకటేశ్వరులు చెప్పారు.