
ముండ్లమూరు (తాళ్లూరు): ముండ్లమూరు మండలం చిన ఉల్లగల్లు–రెడ్డినగర్ మధ్య పొలాల్లో జమ్మిచెట్టుకు గుర్తు తెలియని యువకుడు శనివారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పశుపోషకులు జమ్మిచెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఓ యువకుడు నాలుగు రోజులుగా సమీప పొలాల్లోనే సంచరిస్తున్నాడని పశుపోషకులు తెలిపారు. ఎందుకు ఇక్కడ తిరుగుతున్నావని ప్రశ్నించినా సమాధానం చెప్పలేదని పేర్కొంటున్నారు. మృతదేహాన్ని దర్శి సీఐ శ్రీనివాసరావు, ముండ్లమూరు ఎస్‌ఐ శివనాంచారయ్య పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం దర్శి ప్రభుత్వ వైద్యశాలను తరలించారు. మృతుడు బూడిద రంగు ప్యాంట్, ఎర్ర, నలుపు చారల టీషర్ట్ ధరించి ఉన్నాడు. ప్యాంట్‌కు పెయింట్లు అంటి ఉన్నాయి. మృతుడు పెయింటరై ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment