ప్రకాశం జిల్లాలో ఓ యువకుడు డెంగ్యూ జ్వరంతో మృతి చెందాడు. పర్చూరు మండలం చెరుకూరు గ్రామానికి చెందిన గుద్దేటి నాగకిశోర్‌బాబు(26) నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో అతడిని కుటుంబసభ్యులు పొన్నూరు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉన్నాయని వైద్యులు తెలపటంతో విజయవాడలోని మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించి చికిత్స పొందుతూనే బుధవారం అర్థరాత్రి కన్నుమూశాడు.
డెంగ్యూతో యువకుడు మృతి
Published Thu, Sep 24 2015 9:10 AM | Last Updated on Wed, Aug 1 2018 2:29 PM
Advertisement
Advertisement