
కోల్‌సిటీ (రామగుండం): ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తుండగా ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మారుతీనగర్‌కు చెందిన బైకనవేని శ్రీనివాస్(26) క్యాటరింగ్, పాల వ్యాపారం చేస్తున్నాడు. ఇంటికి సమీపంలోని అడ్డగుంటపల్లిలో ఉండే కనవేణి రమేశ్, ఆయన సోదరుడు సురేశ్‌ను క్యాటరింగ్‌కు తీసుకెళ్తుండేవాడు.
ఇటీ వల మనస్పర్ధల కారణంగా వారిని తీసుకెళ్లడం మానేయడంతో సురేశ్ కక్ష పెంచుకున్నాడు. శనివారం శ్రీనివాస్ తన తల్లి వితంతు పింఛన్ డబ్బును డ్రా చేసేందుకు సమీపంలోని ఏటీఎంకు వెళ్లాడు. అకస్మాత్తుగా ఏటీఎంలోకి చొరబడిన సురేశ్ రోకలిబండతో శ్రీనివాస్ తలపై మోదడంతో అక్కడిక్కడే మృతి చెందాడు.