
సూరి (ఫైల్)
సాక్షి, బుక్కపట్నం: ఈత సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. అదీ తన పుట్టిన రోజే ఈ ఘటన జరిగింది. బంధువులు తెలిపి వివరాల మేరకు.. కృష్ణాపురం గ్రామానికి చెందిన చండ్రాయుడు కుమారుడు సూరి(18) తన పుట్టిన రోజు సందర్భంగా సమీపంలో ఉన్న వ్యయసాయ బావిలోకి స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లాడు. గట్టు మీద నుంచి దూకిన సూరి ఎంతసేపటికీ బయటకు రాక పోవటంతో స్నేహితులు గ్రామస్తులకు తెలిపారు. వారు వచ్చి బావిలోంచి సూరిని బయటకు తీసుకొచ్చినా అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడు. పుట్టిన రోజే తన కుమారుడు పరలోకాలకు పోయాడని తల్లిదండ్రులు కన్నీటి పర్యవంతం అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment