స్నేహితుడికి ప్రేమ వివాహం జరిపించి.. | Man Commits Suicide Because Of Fear | Sakshi
Sakshi News home page

స్నేహితుడికి ప్రేమ వివాహం జరిపించి..

Published Thu, Jun 21 2018 11:22 AM | Last Updated on Tue, Nov 6 2018 8:16 PM

Man Commits Suicide Because Of Fear - Sakshi

సాక్షి, హైదరాబాద్‌‌: స్నేహితుడికి ప్రేమ వివాహం జరిపించిన ఓ యువకుడు తదనంతర పరిణామాలను ఊహించుకొని భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నగరంలోని మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. భువనగరి జిల్లా వలిగొండకు చెందిన సిరికొండ వెంకటేశ్‌(22) మాదాపూర్‌ ఇజ్జత్‌నగర్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తన ఊరికి చెందిన స్నేహితుడు మహేష్‌ ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరిపించాల్సిందిగా వెంకటేశ్‌ను కోరాడు.

దీంతో స్నేహితుడికి మద్దతుగా నిలిచిన వెంకటేశ్‌ పెళ్లి చేశాడు. కానీ అమ్మాయి కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందోనని భయపడ్డాడు. ఆ భయంతోనే తాను అద్దెకుంటున్న గదిలో ఉరి వేసుకొని చనిపోయాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement