మైసూరు: ప్రేమ వివాహం చేసుకున్న యువతితో మనస్పర్థలు రావడంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం జిల్లాలోని నంజనగూడు తాలూకాలో చోటు చేసుకుంది. తాలూకాలోని సుత్తూరు గ్రామానికి చెందిన రసిక (23) సొంత పెద్దమ్మ కుమార్తె, అక్క వరుసయ్యే కావ్య అనే యువతిని కొద్ది సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం తెలియడంతో ఇరువురి తల్లితండ్రులు, కుటుంబ సభ్యులు మందలించారు. వీరు అందరిని ఎదిరించి మూడు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న కొద్ది రోజుల నుంచి ఇద్దరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. శనివారం కూడా ఇద్దరి మధ్య గొడవ జరగడంతో మనస్థాపం చెందిన రసిక ఆదివారం కావ్య సొంతూరు కోచనహళ్లికి చేరుకొని పొలంలో ఉరేసుకొని ఆత్మహత్మకు పాల్పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment