
చెన్నారావుపేట(నర్సంపేట) : యువతిని వేధించిన యువకుడికి దేహశుద్ధి చేసిన సంఘటన వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని సూరుపల్లి గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పబ్బతి ప్రవీణ్ ఇదే గ్రామానికి చెందిన ఓ యువతిని గత కొద్దిరోజులుగా ఫోన్ చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడు. అంతేగాక యువతి అక్కకు కూడా ఫోన్ చేస్తు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు.
దీంతో కోపోద్రిక్తులైన కుటుంబ సభ్యులు ఆ యువకుడిని బట్టలు ఊడదీసి చెట్టుకు కట్టి చితకబాదారు. దెబ్బలకు యువకుడు సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే అక్కడి నుంచి కుటంబ సభ్యులు వెళ్లిపాయారు. యువకుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఇదంతా గ్రామస్తుల కళ్లెదుటే జరగడంయ గమనర్హాం. యువతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కూచిపూడి జగదీష్ తెలిపారు.