
బాధితుడు అనస్
చిట్టినగర్(విజయవాడపశ్చిమం): ప్రేమించిన యువతిని తనకు కాకుండా చేస్తున్నారంటూ ఓ యవకుడు గురువారం కొత్తపేట పోలీస్‌స్టేషన్ ఎదుట బస్సు కింద పడేందుకు ప్రయత్నించాడు. ఆ యువకుడిని వారించేందుకు పోలీసులు, కుటుంబీకులు తీవ్రంగా ప్రయత్నించారు. సేకరించిన వివరాల ప్రకారం... ఇస్లాంపేటకు చెందిన అనస్ అదే వీధిలో ఉంటు న్న యువతిని ప్రేమించాడు. రెండు రోజుల కిందట ఇద్దరు ఇంటి నుంచి పరారై పెళ్లి చేసుకుని తమ పెద్దల నుంచి రక్షణ కావాలంటూ సీపీని ఆశ్రయించారు.
సీపీ కార్యాలయం నుంచి కొత్తపేట పోలీ స్‌స్టేషన్‌కు చేరింది. యువతి ప దో తరగతి మార్కుల జాబితా తీసుకురావాలని పోలీసులు పేర్కొన్నారు. గురువారం ఉదయానికి అమ్మాయి ప్రేమించిన అబ్బాయితో వెళ్లేందుకు ససేమిరా అనడంతో యువకుడు పోలీస్‌స్టేషన్ బయటకు వచ్చి అటుగా వెళుతున్న సిటీ బస్సు చక్రాల కింద తలపెట్టేందుకు ప్రయత్నించాడు. పోలీసులు, అక్క డే ఉన్న మరి కొంతమంది యువకుడిని అడ్డుకున్నారు. కేటీ రోడ్డుపై పెద్దఎత్తున ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.