లారీ కింద పడ్డ అనీల్ (ఇన్‌సెట్) అనీల్(ఫైల్)
పుంగనూరు : పట్టణంలోని బైపాస్ రోడ్డులోని ఫారెస్ట్ ఆఫీస్ సమీపంలో బుధవారం సాయంత్రం ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో యువకుడు మృతి చెందాడు. ఎస్‌ఐ అరుణ్ కుమార్‌రెడ్డి కథనం మేరకు.. స్థానిక కోనేటిపాళ్యంకు చెందిన లేట్ రమేష్ కుమారుడు అనీల్(25) గోకుల్‌వీధిలో దుస్తుల దుకాణం నిర్వహిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్లాడు. తిరిగి దుకాణానికి ద్విచక్రవాహనంలో వస్తుండగా బైపాస్ రోడ్డులో పుంగనూరు నుంచి తమిళనాడుకు ఆవులతో వెళుతున్న లారీ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అనీల్‌ను స్థానికులు 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు ప్రథమ చికిత్స చేసి పరిస్థితి విషమంగా ఉండడంతో రెఫర్ చేశారు. కుటుంబ సభ్యులు ప్రైవేటు అంబులెన్స్‌లో కోలారు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతను మృతిచెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment