bike - lorry
-
ఆగిన లారీని ఢీకొన్న బైక్
మదనపల్లె టౌన్: మదనపల్లె–పుంగనూరు రోడ్డు ఈడిగపల్లె వద్ద శనివారం ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పలమనేరు పట్టణం గడ్డ ఊరికి చెందిన మెకానిక్ షేఖ్‌ఖాద్ బాషా(20), గంగవరం చెన్నారెడ్డిపల్లె నుంచి వచ్చి పలమనేరు పట్టణం గుడియాతం రోడ్డులో కాపురం ఉంటున్న స్నేహితుడు కిరణ్‌కుమార్(22) ద్విచక్ర వాహనంలో సినిమా కోసం మదనపల్లెకు వచ్చారు. తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా మార్గంమధ్యలోని మదనపల్లె–పుంగనూరు రోడ్డు ఈడిగపల్లె వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొన్నారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను 108లో మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఖాదర్‌బాషా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. కిరణ్‌కుమార్ పరిస్థితి విషమంగా ఉందని తిరుపతి రుయాకు రెఫర్ చేయగా కుటుంబీకులు తీసుకెళ్లారు. ఆసుపత్రి ఔట్‌పోస్టు పోలీసులు పుంగనూరు పోలీసులకు సమాచారం అందించగా.. సీఐ గంగిరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఈ బైక్ వాలా ఎంత పనిచేశాడు...
-
ఈ బైక్ వాలా ఎంత పనిచేశాడు...
సాక్షి, రాజేంద్రనగర్ : రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ టోల్ గేట్ వద్ద బైక్ నడిపిస్తున్న వ్యక్తిని తప్పించబోయి రెండు లారీలు ఢీకొన్నాయి. సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్ గాయపడ్డారు. వివరాలు.. ఈ సాయంత్రం పీడీఎస్ రైస్‌ని తరలిస్తున్న ఓ లారీ గాంధీ నగర్ వద్ద యూటర్న్ తీసుకోబోయింది. ఈ నేపథ్యంలో ఓ బైకు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చింది. దీంతో లారీ డ్రైవర్ బైక్‌పై ఉన్న వ్యక్తిని తప్పించబోయాడు. వాహనాన్ని పక్కకు తిప్పాడు. లారీ కాస్తా ముందు వస్తున్న మరో లారీని ఢీకొట్టింది. లారీ క్యాబిన్లు నుజ్జనుజ్జయయి డ్రైవర్లకు స్వల్ప గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. టోల్ గేట్ సమీపంలో ఉన్న సీసీ కెమెరాలు యాక్సిడెంట్ దృశ్యాలు చిత్రీకరించాయి. -
లారీ ఢీకొని యువకుడి మృతి
పుంగనూరు : పట్టణంలోని బైపాస్ రోడ్డులోని ఫారెస్ట్ ఆఫీస్ సమీపంలో బుధవారం సాయంత్రం ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో యువకుడు మృతి చెందాడు. ఎస్ఐ అరుణ్ కుమార్‌రెడ్డి కథనం మేరకు.. స్థానిక కోనేటిపాళ్యంకు చెందిన లేట్ రమేష్ కుమారుడు అనీల్(25) గోకుల్‌వీధిలో దుస్తుల దుకాణం నిర్వహిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్లాడు. తిరిగి దుకాణానికి ద్విచక్రవాహనంలో వస్తుండగా బైపాస్ రోడ్డులో పుంగనూరు నుంచి తమిళనాడుకు ఆవులతో వెళుతున్న లారీ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అనీల్‌ను స్థానికులు 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు ప్రథమ చికిత్స చేసి పరిస్థితి విషమంగా ఉండడంతో రెఫర్ చేశారు. కుటుంబ సభ్యులు ప్రైవేటు అంబులెన్స్‌లో కోలారు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతను మృతిచెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఘోర రోడ్డు ప్రమాదం
కదిరి అర్బన్ : ఎక్కడో పుట్టి.. ఎక్కడో చదివి.. ఒకచోట ఉద్యోగంలో చేరిన ఆ ముగ్గురు యువకులు విధి నిర్వహణ కోసం ద్విచక్రవాహనంలో వెళుతుండగా కంటైనర్ ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురూ దుర్మరణం చెందారు. కదిరి పట్టణంలో ఈ ఘటన జరిగింది. రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగం గ్రామానికి చెందిన గణేష్ (24), తెలంగాణలోని వరంగల్ జిల్లా దుర్గండి మండలం వెంకటాపురానికి చెందిన హరీష్ (24) బెంగళూరుకు చెందిన కృషి ఇన్ఫోటెక్ కంపెనీలో ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన చంద్రశేఖర్ (25) ఇదే కంపెనీలో సూపర్వైజర్. నల్లచెరువు మండలం జోగన్నపేట వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను ‘కృషి ఇన్ఫోటెక్’ చేపడుతోంది. ఈ ముగ్గురూ ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం కదిరి పట్టణంలోని హోటల్లో భోజనం చేసి సైట్ వద్దకు వెళ్లేందుకు ముగ్గురు ద్విచక్రవాహనంలో బయలుదేరారు. కదిరి – మదనపల్లి మార్గంలో వేదవ్యాస్ స్కూల్‌వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న కంటైనర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో గణేష్, హరీష్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న చంద్రశేఖర్‌ను పోలీస్ వాహనంలో కదిరి ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ప్రాణాలు విడిచాడు. సంఘటనా స్థలాన్ని పట్టణ సీఐ గోరంట్లమాధవ్, తహసీల్దార్ పీవీ రమణ పరిశీలించారు. మృతుల్లో ఎవ్వరికీ వివాహాలు కాలేదు. -
రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి
వర్ని: బైక్ ను లారీ ఢీకొన్న ఘటనలో ఓ హెడ్ కానిస్టేబుల్ మృతిచెందాడు. ఈ సంఘటన నిజాబాబాద్ జిల్లా వర్ని చౌరస్తా వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. హెడ్ కానిస్టేబుల్ వెంకటరమణ బైక్ పై పని నిమిత్తం బయటకు వెళ్లగా, వర్నీ చౌరస్తా వద్ద లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటరమణ అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.