
ప్రతీకాత్మక చిత్రం
కాశీబుగ్గ : మహిళలకు అసభ్యకర చిత్రాలు, సంభాషణలు పంపుతున్న యువకుడిని కాశీబుగ్గ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పలాస రైల్వేస్టేషన్ పరిధిలోని రైల్వే కాలనీకి చెందిన షేక్ అబ్దుల్ గఫూర్ తనతో మాట్లాడాలని వాట్సాప్, మెసేజ్, ఇతర లైవ్‌చాట్‌ల అసభ్యకర మెసేజ్‌లు పంపుతూ మహిళలను వేధిస్తున్నాడు. వీటిపై పలాస స్టార్ ఆస్పత్రికి చెందిన సిబ్బంది కమలకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాశీబుగ్గ సీఐ కె.అశోక్‌కుమార్ నిందుతుడిని అరెస్టు చేసి పాతపట్నం సబ్ జైలుకు రిమాండ్‌కు తరలించారు.