వివరాలు చెబుతున్న బాధితుడు రాజు
సాక్షి, రంగారెడ్డి, పరిగి : ఓ కేసు విషయంలో పోలీస్ స్టేషన్‌కు తీసుకు వచ్చిన ఓ దళిత యువకున్ని పోలీసులు చితకబాదారు.. దెబ్బలకు స్పృహ కోల్పోయి పడిపోవటంతో హుఠాహుటిన అంబులెన్స్‌లో పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు బాధిత యువకుడు తెలిపిన వివరాలు...పరిగి మండల పరిధిలోని తొండపల్లి గ్రామానికి చెందిన రాజు అనే దళిత యువకుడిని ఓ కేసు విషయంలో పరిగి పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు.
సాయంత్రం సెకెండ్ ఎస్‌ఐ ఓబుల్‌రెడ్డి రబ్బరుతో ఇష్టారాజ్యంగా కొట్టడంతో స్పృహ కోల్పోయి కింద పడిపోయాడు. దీంతో నలుగురు పోలీసులు 108 అంబులెన్స్‌లో పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారని బాధిత యువకుడు, అతని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజుతో డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడారు.
అయితే కడుపు నోస్తుందని తీసుకు వచ్చి పోలీసులు అడ్మిట్ చేస్తే సెలైన్ ఎక్కించి ట్రీట్‌మెంట్ చేశామని వైద్యురాలు సునిత తెలిపారు. ఇదే విషయమై డీఎస్పీని వివరణ కోరగా తాను అదే విషయాన్ని వెల్లడించారు. కాగా ఈ ఘటనను కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి వెంకటయ్య ఖండించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment